బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రగ్ రాకెట్ కేసులో టాప్ మోడల్ పట్టివేత

By Pratap
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మత్తు పదార్థాల సరఫరాలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి)కి బెంగళూరుకు చెందిన ఓ ప్రముఖ మోడల్ పట్టుబడింది. నార్కోటిక్స్ డ్రగ్స్, సైకోట్రోఫిక్ పదార్థాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద 26 ఏళ్ల దర్శిత్మిత గౌడను అధికారులు అరెస్టు చేశారు.

మంగళూరు, బెంగళూరు, గోవాల్లో విద్యార్థులకు, పనివాళ్లకు, ఇతరులకు మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న ముఠాలో ఆమె పనిచేస్తోందని ఎన్‌సిబి అధికారులు అంటున్నారు. ఫ్యాషన్ ఈవెంట్స్‌లో ఆమె చాలా ఎక్కువగా పాల్గొంటూ ఉంటుంది. ఈ కేసులో పట్టుబడిన ఐదో వ్యక్తి ఆమె.

ఈ మత్తుపదార్థాల సరఫారాకు సంబంధించిన కేసు దర్యాప్తును ఎన్‌సిబి నిరుడు నవంబర్ 30వ తేదీన ప్రారంభించింది. మోడల్ తన బాయ్ ఫ్రెండ్ నిశాంత్ కలిసి ఉంటున్న ఆర్టీ నగర్‌లోని ఆపార్టుమెంటులో అధికారులు సోదాలు నిర్వహించారు.

Top Bengaluru model arrested in drug racket

ఆ నివాసంలో 110 గ్రాముల కొకైన్, 19 గ్రాముల హషీస్, 1.2 గ్రామ ఎండిఎంఎ, ఓ ఎల్‌ఎస్‌డి బ్లాట్ అధికారులకు సోదాల్లో లభించాయి. అధికారులు సోదాలు చేసిన సమయంలో దర్శిత్మిత ఇంట్లో లేదు. ఆమె బాయ్‌ఫ్రెండ్ నిశాంత్‌ను అధికారులు అరెస్టు చేశారు. దర్శిత్మిత ముఠాలో పనిచేస్తూ ఆర్థిక లావాదేవీలను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

సాక్ష్యాధారులు సేకరించిన తర్వాత అధికారులు ఆమెకు సమన్లు జారీ చేశారు. దర్శిత్మిత మంగళవారంనాడు ఎన్‌సిబి అధికారుల ముందు హాజరయింది. విచారణ అనంతరం ఆమెను అధికారులో కస్టడీలోకి తీసుకున్నారు.

English summary
A top model from the city here was arrested on drug trafficking charges by the Narcotics Control Bureau (NCB) on Tuesday. Darshitmita Gowda, 26, was arrested under various sections of the Narcotics Drugs and Psychotropic Substances Act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X