• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సుప్రీంకోర్టుకు సీబీఐ వివాదం, నాగేశ్వరరావు నియామకం పైనా: జేపీ, లక్ష్మీనారాయణ ఏమన్నారంటే?

|
  నాగేశ్వరరావు నియామకం పై జేపీ స్పందన

  న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ బాధ్యతల నుంచి తనను తప్పించడంపై అలోక్ వర్మ కేంద్ర ప్రభుత్వంపై న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలోక్ వర్మ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం విచారణను ఎల్లుండి (శుక్రవారం) విచారించనుంది.

  చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, కేఎం జోసెప్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. అదే సమయంలో సీబీఐ తాత్కాలిక చీఫ్‌గా నాగేశ్వర రావును నియమించడం పైన కూడా అలోక్ వర్మ పిటిషన్ దాఖలు చేశారు.

  సీబీఐలో ఫైట్: రాగానే తెలుగు అధికారి నాగేశ్వరరావు పవర్, సొంత కార్యాలయంలో సోదాలుసీబీఐలో ఫైట్: రాగానే తెలుగు అధికారి నాగేశ్వరరావు పవర్, సొంత కార్యాలయంలో సోదాలు

  కాంగ్రెస్ విమర్శలు

  కాంగ్రెస్ విమర్శలు

  రాకేష్ ఆస్థానాను కాపాడేందుకే సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను తప్పించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. మోడీ ప్రభుత్వం సీబీఐ స్వాతంత్రాన్ని కూడా దెబ్బతీసిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. వ్యవస్థను నాశనం చేయడం, సిబిఐని బజారుకీడ్చడం కూడా అయిపోయిందని అభిప్రాయపడ్డారు. అత్యున్నత సీబీఐను నిర్వీర్యం చేశారన్నారు. ఈ అంశంపై మరో కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ కూడా విమర్శలు గుప్పించారు.

  నిమిషాల్లో రంగంలోకి దిగిన నాగేశ్వర రావు

  నిమిషాల్లో రంగంలోకి దిగిన నాగేశ్వర రావు

  సీబీఐ ఇంచార్జి డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వర రావు మంగళవారం అర్ధరాత్రి నియమించబడ్డారు. ఆ తర్వాత ఆయన బాధ్యతలు తీసుకున్నారు. కొద్ది నిమిషాల్లోనే ఆయన రంగంలోకి దిగారు. రాత్రి ఒంటి గంటకు సీబీఐ ఆఫీసును ఢిల్లీ పోలీసులు చుట్టుముట్టారు. అర్ధరాత్రి ఒకటింపావుకు నాగేశ్వర రావు సీబీఐ కార్యాలయంలోకి వచ్చారు. ఆ తర్వాత సోదాలు నిర్వహించి, 11వ ఫ్లోర్‌లోని సీబీఐ డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ల చాంబర్లు సీజ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. 10వ ఫ్లోర్‌ను సీబీఐ కొత్త డైరెక్టర్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే సీబీఐ హెడ్ క్వార్టర్‌లో ఏ గదిని కూడా సీజ్ చేయలేదని సీబీఐ అధికార ప్రతినిధి చెప్పారు. కాగా, బుధవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు ఢిల్లీ పోలీసుల అదుపులోనే సీబీఐ కార్యాలయం ఉంటుంది. అప్పటి వరకు కేసు ఫైళ్ల కదలికకు బ్రేక్ పడనుంది.

  జయప్రకాశ్ నారాయణ ఏం చెప్పారంటే?

  జయప్రకాశ్ నారాయణ ఏం చెప్పారంటే?


  సీబీఐలో జరుగుతున్న అంశంపై లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ స్పందించారు. అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానాలను వెంటనే తప్పించాలన్నారు.(ఇప్పటికే ప్రభుత్వం వారిని సెలవులపై పంపించింది.) ఇద్దరు కూడా దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారన్నారు.

  నాకు ఎలాంటి ఒత్తిళ్లు రాలేదు

  నాకు ఎలాంటి ఒత్తిళ్లు రాలేదు

  సీబీఐలో జరుగుతున్న వ్యవహారాల్లో నిజాలను నిగ్గు తేల్చాలని ఆ శాఖలో పని చేసిన లక్ష్మీనారాయణ అన్నారు. ఇలాంటి వివాదాల వల్ల సీబీఐ ప్రజల విశ్వాసం కోల్పోతుందని చెప్పారు. తాను అధికారిగా ఉన్నప్పుడు తనపై ఎలాంటి ఒత్తిళ్లు రాలేదని చెప్పారు. తన పనిని తాను స్వతంత్రంగా చేసుకుపోయానని చెప్పారు. సీబీఐలో అధికారుల నియామక ప్రక్రియ పకడ్బంధీగా ఉంటుందన్నారు. అయినా ఇలాంటి సంఘటనలు బాధాకరమన్నారు.

  English summary
  A bench comprising Chief Justice Ranjan Gogoi and Justices SK Kaul and KM Joseph considered the submission of Alok Verma that his plea against the centre's decision to send him on leave required urgent hearing.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X