వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర మాజీ హోం మంత్రి చిదంబరం ఉన్న జైలు ఏషియాలో నెంబర్ వన్, రాజమండ్రి !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ హోం శాఖ, ఆర్థిక శాఖా మంత్రి పి. చిదంబరం శిక్ష అనుభవిస్తున్న తీహార్ జైలు దక్షిణ ఏషియాలోనే నెంబర్ వన్ జైలు. ఐఎన్ఎక్స్ మీడియా స్కాం కేసులో ఇటీవల కేంద్ర మాజీ హోం శాఖ మంత్రి చిదంబరం అరెస్టు అయ్యి తీహార్ జైల్లో ఉన్నారు. ఏషియాలోనే తీహార్ జైలుకు ఓ ప్రత్యేకత ఉందని ఇటీవల ఓ ఎన్ జీఓ సంస్థ నిర్వహించిన సర్వేలో వెలుగు చూసింది. ప్రపంచంలోని వివిద జైళ్లు, అందులోని ఖైదీల జీవనశైలి గురించి ఓ నివేదిక తయారు చేసింది. ఆ నివేదికను ఎన్ జీఓ సంస్థ సంబంధిత దేశాల పార్లమెంట్ కు ఇచ్చింది. భారత్ లోని టాప్ 5 జైళ్లు ఏవి ? అవి ఎక్కడ ఉన్నాయి అనే వివరాలు ఆ నివేదికలో ఉన్నాయి.

ఇంజనీరింగ్ చదివే కూతురు వీడియోలు తీసి లైంగిక వేధింపులు, తండ్రికి 10 ఏళ్లు జైలు !ఇంజనీరింగ్ చదివే కూతురు వీడియోలు తీసి లైంగిక వేధింపులు, తండ్రికి 10 ఏళ్లు జైలు !

తీహార్ జైలు, తీహార్ ఆశ్రమం, తీహార్ జైలు కాంప్ల్ క్స్ 1

తీహార్ జైలు, తీహార్ ఆశ్రమం, తీహార్ జైలు కాంప్ల్ క్స్ 1

పశ్చిమ ఢిల్లీలోని జానకీపురం ప్రాంతానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో తీహార్ సెంట్రల్ జైలు ఉంది. 1984 వరకు పంజాబ్ రాష్ట్రంలో ఉన్న తీహార్ జైలు తరువాత ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతంలోకి వచ్చింది. దక్షిణ ఏషియాలోనే అతి పెద్ద జైలు తీహార్ సెంట్రల్ జైలు. తీహార్ జైలులో 5, 200 మంది ఖైదీలు ఉండటానికి అవకాశం ఉంది. 2012 వివరాల ప్రకారం తీహార్ జైలులో 10, 533 మంది ఖైదీలు ఉన్నారు సంజయ్ గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్, చోటా రాజన్, సురేష్ కల్మాడి, అమర్ సింగ్, కేంద్ర మాజీ హోం శాఖా మంత్రి పి. చిదంబరం ఈ తీహార్ జైలులో శిక్ష అనుభవించారు, ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నారు.

యార్వాడ సెంట్రల్ జైలు 2

యార్వాడ సెంట్రల్ జైలు 2

మహారాష్ట్రలోని పూణేలో ఉన్న యార్వాడ సెంట్రల్ జైలు టాప్ 2 లో నిలిచింది. 512 ఎకరాల్లో యార్వాడ సెంట్రల్ జైలు ను నిర్మించారు. 2017 ప్రకారం 5,000 మందికి పైగా యార్వాడ సెంట్రల్ జైలులో ఉన్నారు. 1871లో బ్రిటీష్ ప్రభుత్వం యార్వాడ సెంట్రల్ జైలు నిర్మించింది. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాలగంగాధర్ తిలక్, జవహర్ లాల్ నెహ్రూ, అణ్ణా హజారే, ప్రముఖ సినీ నటుడు సంజయ్ దత్ తదితర ప్రముఖులు ఇదే జైలులో శిక్ష అనుభవించారు.

పుఝుల్ సెంట్రల్ జైలు 3, చెన్నై

పుఝుల్ సెంట్రల్ జైలు 3, చెన్నై

తమిళనాడు రాజధాని చెన్నైకి 23 కిలోమీటర్ల దూరంలో పుఝల్ సెంట్రల్ జైలు 2006లో తమిళనాడు పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ నిర్మించింది. కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పుఝల్ సెంట్రల్ జైలు నిర్మించడానికి శ్రీకారం చుట్టారు 1,250 మంది ఖైదీలు పుఝల్ సెంట్రల్ జైలులో ఉండటానికి అవకాశం ఉంది.

రాజమండ్రి సెంట్రల్ జైలు 4, ఆంధ్రప్రదేశ్

రాజమండ్రి సెంట్రల్ జైలు 4, ఆంధ్రప్రదేశ్

పోర్చుగ్రీసులు భారత్ లో ఉన్న సమయంలో 1602లో ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో సెంట్రల్ జైలు నిర్మించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో వందల మంది ఖైదీలు ఉండటానికి అవకాశం ఉంది. 196 ఎకరాల్లో రాజమండ్రి సెంట్రల్ జైలు నిర్మించారు.

నైనీ సెంట్రల్ జైలు 5, ఉత్తరప్రదేశ్

నైనీ సెంట్రల్ జైలు 5, ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో నైనీ సెంట్రల్ జైలు ఉంది. 1930లో బ్రిటీష్ కాలంలో ఈ నైనీ సెంట్రల్ జైలు నిర్మించారు. దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన మోతీలాల్ నెహ్రు, జవహర్ లాల్ నెహ్రు, జీబీ. పంత్, రఫి అహమ్మద్ కిద్వాయ్ తదితరులు నైనీ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు.

English summary
New Delhi: Top Five Biggest Central Prisions Of India, In Terms Of Area And Prisoners. This Is Including Tihar, Yerwad etc.,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X