gujarat assembly election results 2017 gujarat legislative assembly election gujarat election results 2017 gujarat assembly elections 2017 gujarat assembly election campaign గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2017 గుజరాత్ ఎన్నికల ఫలితాలు 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ప్రచారం
గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీని ముంచేస్తున్న మూడు ప్రధాన కారణాలు, బీజేపీకి !
అహ్మదాబాద్: గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి, కాంగ్రెస్ ను దెబ్బ కొట్టడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ హవాతో బీజేపీ అధికారంలో రావడం కచ్చితంగా జరుగుతోందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బ తియ్యడానికి మూడు కారణాలు ఉన్నాయి.

రామ మందిరం వివాదం !
గుజరాత్ లో బీజేపీ అధికారంలోకి రావడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి ఎంతో కాలంగా వివాదంలో ఉన్న అయోధ్యలోని రామజన్మభూమిలో రామ మందిరం నిర్మిస్తామని బీజేపీ మరో సారి ప్రకటిచింది.

ఏక వచనంతో ?
రామ మందిర నిర్మాణం గుజరాత్ లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రధాన కారణం అయ్యింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మణిశంకర్ అయ్యర్ మరో కారణం అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీని ఏక వచనంతో మణిశంకర్ అయ్యర్ దూషించారు.

గుజరాత్ కే అవమానం !
ప్రధాని నరేంద్ర మోడీని నీచ్ (నీచుడు) అంటూ మణిశంకర్ అయ్యర్ దూషించారు. తనను నీచుడు అంటూ విమర్శించిన మణిశంకర్ అయ్యర్ మొత్తం గుజరాత్ ప్రజలను అవమానించారని ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల సందర్బంగా జోరుగా ప్రచారం చేశారు.

గుజరాతీల ఆగ్రహాం !
గుజరాతీ అయిన ప్రధాని నరేంద్ర మోడీని నీచుడు అంటూ విమర్శించిన మణింకర్ అయ్యర్ మీద కోపంగా ఉన్న గుజరాతీలు ఈ సారి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేంగా ఓటు వేశారని జోరుగా ప్రచారం జరిగింది. మరో కారణం కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన అదే మణిశంకర్ అయ్యర్ అయ్యారు.

అయ్యర్ ఇంటిలో ?
దాయాది పాకిస్థాన్ కు చెందిన అధికారులతో స్వయంగా తన ఇంటిలో మణిశంకర్ అయ్యర్ భేటీ అయ్యారు. మణిశంకర్ అయ్యర్ ఏ విషయంపై ఆయన ఇంటిలో పాక్ అధికారులు, పాక్ మాజీ మంత్రితో చర్చించారో తెలీదు కాని గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీని దెబ్బ తియ్యడానికి అదో కారణం అయ్యింది.

పాకిస్థాన్ ప్లాన్ ?
గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తున్నదని, అందుకే మణిశంకర్ అయ్యర్ ఇంటిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదిరులతో పాక్ అధికారులు భేటీ అయ్యారని, దాయాది దేశం కుట్రలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు.

కాంగ్రెస్ ను ముంచేసింది !
మొత్తం మీద మూడు కారణాలు గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీని దెబ్బ తియ్యడానికి ప్రధాన కారణాలు అవుతున్నాయి. అందులో రెండు కారణాలకు మణిశంకర్ అయ్యర్ కేంద్ర బింధువు అయ్యారు. గుజరాత్ లో ఈ మూడు కారణాలు బీజేపీకి అనుకూలంగా ఓట్లు పడటానికి కారణం అయ్యాయి.