వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మలయాళం హీరో దిలీప్ బహిష్కరణ, మమ్ముట్టి ఇంటిలో నిర్ణయం, నటికి మద్దతు !

ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన ప్రముఖ మాలీవుడ్ హీరో దిలీప్ ను మలయాళం నటీ నటుల సంఘం (ఎఎంఎంఎ) నుంచి బహిష్కరించారు. లైంగిక దాడికి గురైన నటికి అండగా ఉండాలని ఎఎంఎంఎ తీర్మానించ

|
Google Oneindia TeluguNews

కొచ్చి: ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన ప్రముఖ మాలీవుడ్ హీరో దిలీప్ ను మలయాళం నటీ నటుల సంఘం (ఎఎంఎంఎ) నుంచి బహిష్కరించారు. లైంగిక దాడికి గురైన నటికి అండగా ఉండాలని ఎఎంఎంఎ తీర్మానించింది.

నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో సోమవారం రాత్రి దిలీప్ ను అరెస్టు చేసిన విషయం తెలిసింది. కొచ్చిలోని మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి నివాసంలో మంగళవారం ఎఎంఎంఎ పదాధికారులు, సభ్యులు సమావేశం అయ్యారు.

Top Malayalam actors met at the Kochi home of mega star Mammootty today

మమ్ముట్టి, మోహన్ లాల్, పృద్విరాజ్ తదితరులు దిలీప్ విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఎఎంఎంఎ సంఘం నుంచి దిలీప్ ను బహిష్కరించాలని నిర్ణయించారు. ఉన్నత స్థాయిలో ఉంటూ సాటి నటి పట్ల దిలీప్ దారుణంగా ప్రవర్తించాడని మమ్ముట్టి, మోహన్ లాల్ తదితరులు అసహనం వ్యక్తం చేశారని తెలిసింది.

దిలీప్ కు ఎఎంఎంఎ నుంచి ఎలాంటి సహాయం చెయ్యకూడదని ఇదే సందర్బంలో తీర్మానించారని సమాచారం. నటికి అందరం అండగా ఉండాలని ఇదే సందర్బంలో నిర్ణయించారు. ఫిబ్రవరి 17వ తేదిన ప్రముఖ నటి షూటింగ్ ముగించుకుని ఇంటికి వెలుతున్న సమయంలో కిడ్నాప్ చేసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారనే కేసులో హీరో దిలీప్ అరెస్టు అయ్యాడు.

English summary
Top Malayalam actors met at the Kochi home of mega star Mammootty today and sacked their colleague Dileep from their organisation, the Association of Malayalam Movie Artists (AMMA)
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X