వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీబీఐ కొత్త డైరెక్టర్‌గా ఎం. నాగేశ్వరరావు...రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకున్న కేంద్రం

|
Google Oneindia TeluguNews

సీబీఐలో లంచాల బాగోతం వెలుగుచూసిన నేపథ్యంలో ఆ సంస్థ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్తానాలను కేంద్రం సెలవుపై పంపింది. కొత్త డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వరరావును నియమించింది. ముడుపులు తీసుకున్నారని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో పరువు పోయిందని భావించిన కేంద్రం రాత్రికి రాత్రే నాగేశ్వరరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.తక్షణమే బాధ్యతలు స్వీకరించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది కేంద్రం.

ముగ్గురు అధికారులను సెలవుపై పంపిన కేంద్రం

ముగ్గురు అధికారులను సెలవుపై పంపిన కేంద్రం

సీబీఐలో మొత్తం ముగ్గురు అధికారులను కేంద్రం పక్కకు బెట్టింది. ఒకరు అలోక్ వర్మ, రెండో వ్యక్తి రాకేష్ అస్తానా కాగా అస్తానా ఫిర్యాదులో ఏకే శర్మ పేరు బయటకు రావడంతో ఆయన్ను కూడా కేంద్రం తప్పించింది. వీరిపై కేసు ఓ కొలిక్కి వచ్చే వరకు అన్ని బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని ఉంటే బాగుండేది అని అన్నారు సీబీఐ మాజీ ఛీఫ్ డాక్టర్ కార్తికేయన్. అదే సమయంలో చర్యలు తీసుకుని ఉంటే ఇంత రచ్చ జరిగేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

 ఎవరు ఈ నాగేశ్వరరావు

ఎవరు ఈ నాగేశ్వరరావు

మన్నెం నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు చెందిన వారు. ఆయన విద్యాభ్యాసం అంతా వరంగల్ జిల్లాలోనే సాగింది. అనంతరం కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టుగా పీజీ ఉస్మానియా యూనివర్శిటీలో చేశారు. ఆ తర్వాత పీహెచ్‌డీ చేస్తున్న సమయంలోనే ఆయన సివిల్స్ పరీక్ష రాసి ఐపీఎస్ అయ్యారు. 1986 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన నాగేశ్వరరావు ఒడిషా క్యాడర్‌లో పోస్ట్ అయ్యారు. పలు బాధ్యతలు నిర్వర్తించిన నాగేశ్వరరావు... ప్రస్తుతం సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

 ఆస్తానాకు కాస్త ఊరటనిస్తే ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

ఆస్తానాకు కాస్త ఊరటనిస్తే ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు


ఇదిలా ఉంటే ఢిల్లీ హైకోర్టు ఆస్తానాపై ఎలాంటి బలవంతపు చర్యలకు పాల్పడవద్దని మంగళవారం ఆదేశాలు ఇస్తూ కేసును ఈనెల 29కి వాయిదా వేసింది. ఇప్పటికే సీబీఐ మాంసపు ఎగుమతి దారుడు మోయిన్ ఖురేషీ కేసులో డీఎస్పీ దేవేంద్ర కుమార్‌ను అరెస్టు చేసింది. ప్రముఖ వ్యాపారవేత్త సతీష్ బాబు సానా ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా కేసు కీలక మలుపుతీసుకుంది. తెలుగు దేశం ఎంపీ సీఎం రమేష్ సీబీఐకి తనకు మధ్య మధ్యవర్తిత్వం చేశాడని సతీష్ చెప్పడంతో కేసు తీవ్రత మరింత పెరిగింది.

English summary
CBI director Alok Verma and special director Rakesh Asthana have been asked to proceed on leave in the midst of an internal rift over bribery allegations against the latter, PTI quoted sources as saying on Wednesday. As per a government order, CBI joint director Nageshwar Rao will take interim charge of the investigation agency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X