వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియాలో ఎక్కువమంది డౌన్ లోడ్ చేసుకున్న యాప్స్ ఏవో తెలుసా? రిపోర్టులో ఆసక్తికర విషయాలు

|
Google Oneindia TeluguNews

ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఓలా, ఉబెర్, స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్ లేని ప్రపంచాన్ని మనం ఊహించడం ప్రస్తుత పరిస్థితుల్లో కొంచెం కష్టమనే చెప్పాలి. కొత్త దశాబ్దంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో గత పదేళ్లలో మార్పులకు సంబంధించి అనేకరకాల వార్తలు, విశ్లేషణలు వచ్చాయి. గూగుల్ సంస్థ కూడా డికేడ్ లో బెస్ట్ మూవీస్, బెస్ట్ న్యూస్, న్యూస్ మేకర్స్, ఈవెంట్స్ తదితర జాబితాల్ని ప్రచురించింది.

బెస్ట్ యాప్స్ ఏవో తెలుసా?

బెస్ట్ యాప్స్ ఏవో తెలుసా?

దశాబ్దిలో బెస్ట్ అంటూ గూగుల్ వెల్లడించిన తరహాలోనే.. ‘యానీ'అనే మార్కెట్ డేటా అనలిటిక్స్ కెంపెనీ కొన్ని లెక్కల్ని విడుదల చేసింది. గత పదేళ్లలో ఇండియాలో ఎక్కువమంది డౌన్ లోడ్ చేసుకున్న మొబైల్ యాప్స్ జాబితాను రూపొందించింది. ఆలస్యం చెయ్యకుండా 2010 నుంచి 2019 మధ్య కాలంలో ఎక్కువ డౌన్‌లోడ్లు సాధించిన ఆ యాప్స్ ఏవో చదివేద్దామా..

ఫస్ట్‌ ప్లేస్‌లో ఫేస్‌బుక్

ఫస్ట్‌ ప్లేస్‌లో ఫేస్‌బుక్

‘యానీ' కంపెనీ అనలైజ్ చేసిన డేటాను బట్టి ఇండియాలో గత పదేళ్లలో డౌన్‌లోడైన యాప్స్ లో ఫేస్‌బుక్ నంబర్ వన్ పొజిషన్ లో నిలిచింది. ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ చాటింగ్ ను సులభతరం చేస్తూ iOS మరియు Android డివైజ్‌ల కోసం ఆ సంస్థ 2011లో ప్రవేశపెట్టిన మెసెంజర్ యాప్.. గడిచిన దశాబ్దిలో ఎక్కువ డౌన్ లోడ్లు సాధించిన యాప్స్ లో రెండోది. ఉచిత క్రాస్ ఫ్లాట్ ఫామ్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. మూడో స్థానంలో నిలిచింది. మిలీనియల్స్ అందరూ ఇన్‌స్టాగ్రామ్ కు ప్రయారిటీ ఇస్తుండటం తెలిసిందే. 2010 నుంచి 2019 మధ్య డౌన్‌లోడైన యాప్స్ లో ఇది నాలుగో స్థానంలో ఉంది. మోస్ట్ డౌన్‌లోడెడ్ యాప్స్ లో మొదటి నాలుగూ ఫేస్ బుక్ సంస్థకు చెందినవేకావడం గమనార్హం.

తర్వాతి స్థానాల్లో..

తర్వాతి స్థానాల్లో..

ఇన్స్‌టాగ్రామ్, స్నాప్ చాట్
మిలీనియల్స్ అందరూ ఇన్‌స్టాగ్రామ్ కు ప్రయారిటీ ఇస్తుండటం తెలిసిందే. 2010 నుంచి 2019 మధ్య డౌన్‌లోడైన యాప్స్ లో ఇది నాలుగో స్థానంలో ఉంది. మోస్ట్ డౌన్‌లోడెడ్ యాప్స్ లో మొదటి నాలుగూ ఫేస్ బుక్ సంస్థకు చెందినవే కావడం గమనార్హం. 2011లో ఇండియాకు పరిచయమైన స్నాప్ చాట్.. గడిచిన దశాబ్ది మోస్ట్ డౌన్‌లోడెడ్ యాప్స్ లో ఐదు స్థానం పొందింది.

 తర్వాతి స్థానాల్లో..

తర్వాతి స్థానాల్లో..

ఇక వీడియో, వాయిస్ కాలాంగ్ యాప్ స్కైప్ ఆరో ప్లేస్ లో ఉండగా, ప్రపంచాన్ని షేక్ చేస్తోన్న టిక్ టాక్ యాప్ ఏడో స్థానాన్ని ఆక్రమించింది. ఎనిమిదో ప్లేస్ లో యూసీ బ్రౌజర్, తొమ్మిదిలో యూట్యూబ్, 2006లో నెటిజన్ల ముందుకు వచ్చిన ట్విట్టర్ పదో స్థానాన్ని పంచుకున్నాయి. అత్యంత ప్రజాదరణ ఉన్న యాప్స్‌లో ట్విట్టర్ ఒకటి అని తెలిసిందే.

English summary
a mobile market data and analytics firm App Annie has revealed the Apps that ruled this decade. The company revealed the top 10 most-downloaded apps between 2010 and 2019. While Facebook had the top spot, FB owned Apps secured the top four slots
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X