వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ : అమేథీలో రాహుల్ గెలుపు కష్టమే... వాయనాడ్‌లో పరిస్థితి ఏమిటి..?

|
Google Oneindia TeluguNews

Recommended Video

రాహుల్ గెలవడమే కష్టమైతే...!! ఇక మిగతావాళ్ళ సంగతేంటో..!! || Oneindia Telugu

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. ఇక నాయకుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. వారి అదృష్టం ఎలా ఉందో అనేది మాత్రం మే 23నే బయటపడుతుంది. ఇక కొన్ని పార్టీల అధినేతలు, కీలక నాయకులు గెలుస్తారా లేక ఓడిపోతారా అనేదానిపై కూడా జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఆయన గెలుపుపై జోరుగా చర్చ జరుగుతోంది. అంతేకాదు కొన్ని చోట్లు బెట్టింగులు కూడా భారీగానే జరుగుతున్నాయి.

అమేథీలో రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటి..?

అమేథీలో రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటి..?

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేసిన గెలుపు నల్లేరుపై నడకే అన్నట్లుగా ఉంటుంది. ఈ సారి రాహుల్ గాంధీ ఎప్పుడైతే రెండు నియోజకవర్గాలనుంచి పోటీ చేయాలని భావించారో ఆనాటి నుంచి ఆయన్ను ఓటమి భయం పట్టుకుందని విపక్షాలు విమర్శించాయి. అమేథీలో రాహుల్‌గాంధీకి స్మృతీ ఇరానీ నుంచి గట్టి పోటీ ఎదురైందని ఆయన గెలుపు కూడా కొంచెం అటు ఇటుగా ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి. అమేథీ గాంధీ కుటుంబానికి కంచుకోట. ఇక అక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటమి పాలైతే కాంగ్రెస్ పతనం ప్రారంభమైనట్టే అని కొందరు అభిప్రాయపడుతున్నారు. 2004 రాహుల్ గాంధీ అక్కడి నుంచి పోటీ చేసి తొలిసారిగా లోక్‌సభకు వెళ్లారు. ఇక అప్పటి నుంచి రాహుల్ గాంధీ అమేథీలోనే పాగా వేశారు.

2014లో రాహుల్ మెజార్టీని తగ్గించిన స్మృతీ ఇరానీ

2014లో రాహుల్ మెజార్టీని తగ్గించిన స్మృతీ ఇరానీ

తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ చూస్తే అమేథీలో రాహుల్ గాంధీ గెలుపు అంత ఈజీగా లేదని సూచిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నారని సూచిస్తున్నాయి. అంతేకాదు అమేథీలో ఎస్పీ బీఎస్పీ కూటమి నుంచి కూడా అభ్యర్థి బరిలో లేరు. అలా చూస్తే రాహుల్ గాంధీ గెలుపు మరింత సులభం కావాలి. కానీ పరిస్థితి చాలా టైట్‌గా మారినట్లు తెలుస్తోంది. 2014లో స్మృతీ ఇరానీ రాహుల్‌పై పోటీ చేసి ఓటమిపాలయ్యారు.అయితే రాహుల్ గాంధీ మెజార్టీని తగ్గించడంలో స్మృతీ ఇరానీ సక్సెస్ అయ్యారు. ఇక ఈసారి మాత్రం అమేథీ సీటు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది అదే సమయంలో ఓడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అయితే ఈ సీటుపై మాత్రం పార్టీ అభ్యర్థి కాకుండా పార్టీకి ఎంత పాపులారిటీ ఉందో అనేదానిపై సర్వే చేయడం జరిగింది. ఇందులో బీజేపీకే చాలామంది జై కొట్టారు. ఒకవేళ వీరంతా బీజేపీకే ఓటు వేసి ఉంటే కాంగ్రెస్ కంచుకోట అమేథీలో కమలం పార్టీ వికసించే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.

మూడు శాతం ఓట్లు తేడా ఉంటే టఫ్ సీట్ కిందే లెక్క

మూడు శాతం ఓట్లు తేడా ఉంటే టఫ్ సీట్ కిందే లెక్క

సాధారణంగా మూడు శాతం ఓట్లు ఇరు పార్టీల అభ్యర్థుల మధ్య తేడా ఉంటే దాన్ని టఫ్ సీటుగా పరిగణించడం జరుగుతుంది. అమేథీలో కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య తేడా మూడు శాతం కంటే తక్కువగా ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ ఒక్క అమేథీ నుంచే కాకుండా కేరళలోని వాయనాడ్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. అమేథీతో పోలిస్తే రాహుల్ గాంధీకి వాయనాడ్‌లోనే గెలుపు అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. వాయనాడ్‌లో కాంగ్రెస్ పార్టీకి మంచి పాపులారిటీ ఉండటమే కాదు... ఆ పార్టీ మిత్రపక్షం యూడీఎఫ్‌కు కూడా మంచి ప్రజాదరణ ఉందని ఎగ్జిట్ పోల్స్ ప్రెడిక్ట్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వాయనాడ్‌లో రాహుల్‌ గెలుపు సులభంగా మారుతుందని అంచనా వేస్తున్నారు.

మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా లేదా అనేది తెలియాలంటే మే 23 వరకు ఆగాల్సిందే. రాహుల్ గాంధీ అమేథీ నుంచి ఓడిపోతారా.. వాయనాడు నుంచి ఎంపీగా గెలుస్తారా అన్న ప్రశ్నలకు సమాధానం మాత్రం మే 23వ తేదీనే తెలుస్తుంది.

English summary
Well its turning out to be a tough fight in Amethi for Congress President Rahul Gandhi. Rahul Gandhi contested this time from Amethi as well as Wayanad from Kerala. Exit polls predict that his victory would be more easier in Wayanad than in Amethi. Smriti Irani who is fielded opposite Rahul seems to have given a tough fight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X