వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టఫ్ టైమ్: టెలికాం ఉద్యోగుల కెరీర్‌పై 'లే ఆఫ్స్' కత్తి!, వేలమంది రోడ్డున పడ్డట్టే!

కంపెనీలు సంస్థల అమ్మకాలకు సిద్దపడటంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.సంస్థలు కంపెనీ అమ్మకాలకు సిద్దపడటంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: భారతీయ టెలికాం రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు మున్ముందు గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టెలికాం రంగంలో క్రియాశీలకంగా ఉన్న కంపెనీలు.. సంస్థలను మూసివేయాలని భావించడం, మరికొన్ని సంస్థలు కంపెనీ అమ్మకాలకు సిద్దపడటంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.

ఐటీకి ఏమైంది?: కెరీర్‌పై నిజంగానే కత్తి వేలాడుతోందా?, ఇదీ అసలు మర్మం..ఐటీకి ఏమైంది?: కెరీర్‌పై నిజంగానే కత్తి వేలాడుతోందా?, ఇదీ అసలు మర్మం..

 హెచ్చరిస్తున్న ప్లేస్‌మెంట్ సంస్థలు:

హెచ్చరిస్తున్న ప్లేస్‌మెంట్ సంస్థలు:

టెలికాం రంగంపై కన్సాల్డిషన్ ప్రభావం గణనీయంగా ఉంటుందని పలు ప్లేస్‌మెంట్ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే దాని ప్రభావం మొదలవగా..

వచ్చే ఏడాదికల్లా మరింత విస్తరించే అవకాశం ఉందని ఆ సంస్థలు చెబుతున్నాయి. కింది స్థాయి, ఉన్నత స్థాయి అన్న తేడా లేకుండా అన్ని కేటగిరీల్లోను జాబ్ లాస్ ప్రభావం ఉంటుందనేది ప్లేస్‌మెంట్ సంస్థల వాదన.

 తక్కువ వేతనమే

తక్కువ వేతనమే

ఉద్యోగాలు కోల్పోయే టెలికాం రంగ నిపుణులు తమ నైపుణ్యాలకు మరింత పదును పెట్టుకుంటే తప్ప మరో ఉద్యోగం సాధించడం కష్టమని.. అయినప్పటికీ తక్కువ వేతనాలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని ప్లేస్‌మెంట్ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే 12 నెలల కాలంలో 20 వేల నుంచి 30 వేల వరకు టెలికాం ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోతారని హెచ్చరిస్తున్నాయి.

 ఉద్యోగులకు దెబ్బే

ఉద్యోగులకు దెబ్బే

పరిస్థితులు చూస్తుంటే.. ప్లేస్‌మెంట్ సంస్థల హెచ్చరికలు త్వరలోనే నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ తన వైర్‌లెస్‌ వ్యాపారాలను మూసివేయాలని నిర్ణయించింది. మరోవైపు టాటా గ్రూప్‌, తన మొబైల్‌ వ్యాపారాలను భారతీ ఎయిర్‌టెల్‌కు విక్రయిస్తోంది. దీంతో ఆయా కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులంతా బయటకు వెళ్లక తప్పని పరిస్థితి.

 హెచ్చరిస్తున్న సంస్థలు

హెచ్చరిస్తున్న సంస్థలు

టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌, మాన్‌పవర్‌ గ్రూప్‌ సర్వీసెస్‌, ఏబీసీ కన్సల్టెంట్స్‌, ర్యాండ్‌స్టాడ్‌ ఇండియా, కార్న్‌ ఫెర్రీ సంస్థలు ఈ లే ఆఫ్స్ గురించి అంచనా వేస్తున్నాయి. కంపెనీల్లో మౌలిక సదుపాయాలు, నెట్‌వర్కింగ్‌ ఇంజనీరింగ్‌, సేల్స్‌, డిస్ట్రిబ్యూషన్‌, టెలికాం ఇంజనీరింగ్‌, హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌, కాల్‌ సెంటర్‌, ఇతర అనుబంధ ప్రొఫెషన్స్ కు చెందిన నిపుణుల కెరీర్ ప్రమాదంలో పడ్డట్టేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

 వీళ్ల కెరీర్ ప్రమాదంలో

వీళ్ల కెరీర్ ప్రమాదంలో

ఇన్‌ఫ్రాక్ట్ర్చర్‌, సేల్స్‌, డిస్ట్రిబ్యూషన్‌ విభాగం వారిపై కన్సాల్డిషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం. ఉద్యోగాలు కోల్పోయేవాళ్లలో మధ్య, కింద స్థాయి ఉద్యోగులే ఎక్కువగా ఉంటారన్నారు.

English summary
Job losses arising out of consolidation in the telecom sector are likely to extend over the next year, with a range of positions across categories likely to be affected,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X