వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టొయోటా ఫార్చూనర్-భారతదేశపు ప్రీమియం ఎస్‌యూవీ

Google Oneindia TeluguNews

ఎవరికైనా 7 ఆసనాల ఎస్‌యూవీ కారు అనగానే మొదటిగా గురుతుకు వచ్చేది టొయోటా ఫార్చూనర్. ఎందుకంటే ఈ కారు భారతీయ మార్కెట్లో బాగా పేరును సంపాదించింది కాబట్టి. టొయోటా ఫార్చూనర్ కారు మొదటి సారిగా 2009లో లాంచ్ చెయ్యటం జరిగింది. అప్పటి నుండె ఆఫ్ రాడ్ సెగ్మేంట్లో బాగా గుర్తింపు తెచ్చుకుంది.

మొదటి సారిగ విడుదల చేసి మార్కెట్లో విజయాన్ని సాధించిన తరువాత టొయోటా సంస్థ రెండవ జనరేషన్ ఫార్చ్యూనర్ కారును విడుదల చేసింది. ఫస్ట్ జనరేషన్ కారులాగే సెకెండ్ జనరేషన్ ఫార్చూనర్ కారు కూడా మార్కెట్లో అత్యంధికంగా అమ్ముడుపోయింది. టొయోటా ఫార్చూనర్ ఒక ఆఫ్-రోడ్లలో మాత్రమే కాకుండా నగర ప్రదేశాలలో కూడా చాలా తేలికగ డ్రైవ్ చెయ్యవచ్చు.

Toyota Fortuner - India’s Favourite Premium SUV

భారతదేశపు ప్రీమియం ఎస్‌యూవీ టొయోటా ఫార్చ్యూనర్

తాంత్రికంగా 7 ఆసనాల టొయోటా ఫార్చూనర్ 2.8 లీటర్ డీసెల్ మరియు 2.7 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అషన్లలో ఎంపిక చేస్కోవచ్చు. డీసెల్ ఇంజిన్ గల ఫార్చూనర్ మ్యానువల్ వేరియంట్ కారులు 175.5 బిహెచ్పి ఇంక 420 ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తే ఆటొమ్యాటిక్ వేరియంట్ కారులు 450 ఎన్ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. మరియు 6 స్పీడ్ ఆటొమ్యాటిక్ గేర్బాక్స్ తో ఇంజిన్ ను అనుసంధానం చేయగలిగింది.

ఇంక పెట్రోల్ ఆధారం పై నడిచే ఫార్చూనర్ కారులు 2.7 లీటర్ పెట్రోల్ ఇంజిన్ సహాయంతో 164 బిహెచ్పి ఇంక 245 ఎన్ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేసే సామర్థ్యాన్ని కలిగింది. పెట్రోల్ ఇంజిన్లను 5 స్పీడ్ మ్యానువల్ లేకా 6 స్పీడ్ ఆటొమ్యాటిక్ గేర్బాక్స్లతో జోడించడం జరిగింది.

Toyota Fortuner - India’s Favourite Premium SUV

టొయోటా ఫార్చ్యూనర్‌ని తేలికగా డ్రైవ్ చేయవచ్చు

డీసెల్ వేరియంట్ టొయోటా ఫార్చూనర్ కారులు ఆల్-విల్ డ్రైవ్ సిస్టంను పొందటంతో రోడ్లలో చాలా తేలికగా రైడ్ చెయ్యవచ్చు. ఆల్ విల్-డ్రైవ్ సిస్టం డ్రైవర్లు అధిక మరియు తక్కువ శ్రేణి మోడ్లతో వస్తుంది, తద్వారా ఏ వదులుగా భూమి లేదా గమ్మత్తైన స్థలాకృతి మీకు ఇబ్బంది కలుగదు.

ఎక్కువ పరిమాణం ఉన్నప్పటికీ మంచి మైలేజ్ ఇస్తుంది. ఫార్చూనర్ పెట్రోల్ మాడల్ కారులు ప్రతి లీటర్కు దాదాపు 10 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే ఇంక డీసెల్ మాడల్ పార్చునర్ కారులు ప్రతి లిటర్కు 12 నించి 14 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

Toyota Fortuner - India’s Favourite Premium SUV

టొయోటా ఫార్చూనర్ ఒక్క ప్రీమియం ఎస్యువి ఐనందువలన దీంట్లో కావాల్సిన పరికరాలను ఇవ్వటం జరిగింది. కారు లోపల బ్లాక్ అండ్ బ్రోన్ డ్యూయల్ టన్న క్యాబిన్ ఇవ్వడంతో పాటు కారుయొక్క డ్యాష్బోర్డు పైన వుడెన్ ట్రిమ్ మరియు సిల్వర్ ఆక్సెన్ట్లను ఇవ్వటం జరిగింది.

అంతేకాకుండా కారు లోపల 7 అంగుళాల నినావిగేషన్ అశం గల ఇంపోటైనమెంట్ సిస్టం, ఆటొమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటో రియర్ కూలర్, క్రూస్ కంట్రోల్, పెద్ద మల్టి ఇంపార్మెషన్ డిస్ప్లే, కుల్డ్ అప్పర్ గ్లౌ బాక్స్ లాంటో పలు రకాల పింఛన్లను ఇవ్వటమే కాకుండ ఎకో మరియు పవర్ అనే రెండు డ్రైవింగ్ మోడ్లను ఇచ్చారు.

Toyota Fortuner - India’s Favourite Premium SUV

కారులోని సీట్లను మృదువైన బట్టతో కుట్టటమే కాకుండా, గ్రైన్ ప్యాటర్న్ గల అలంకరణ ఇవ్వటంతో ప్రీమియం లుక్ అదింస్తుంది. సెకెండ్ రో సిటింగ్ స్థానం లో ఒక్క బటన్ నొక్కగానే మిగిత ప్రయాణికులకు మూడవ రో లోపల కూర్చునేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. మరియు ఈ కారులో ౭ మంది కూర్చునేంత స్థలం ఉంది.

సురక్షిత ప్రయాణం కోసం టొయోటా ఫార్చ్యూనర్‌లో 7ఎయిర్‌బ్యాగ్స్

టొయోటా ఫార్చూనర్ కారులో ప్రయాణికుల సురక్షిత కోసం ఏడు ఎర్బ్యాగులూ, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్, హిల్ అసిస్ట్, ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సిట్ మౌంట్లు, ఎబిఎస్ తో పాటు ఇబిడి మరియు డౌన్-హిల్ అసిస్ట్ కంట్రోల్ ఫిచార్లను ఇవ్వడం జరిగింది.

ఇందు మూలంగా మీరు గాని లేక మీ స్నేహితులతో ఎవరైనా ౭ ఆసనం కలిగిన ఫుల్ సైజ్ ఆఫ్-రోడ్ ఎస్యువి కారును కొనాలని ఆలోచిస్తు ఉంటే, టొయోటా ఫార్చూనర్ కారు ది బెస్ట్ అని మా సలహ.

Toyota Fortuner - India’s Favourite Premium SUV

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X