వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ల్యాప్ టాప్ బుక్ చేస్తే , పార్శిల్ లో చూస్తే షాక్ అవుతారు

ఆన్ లైన్ లో బుక్ చేసిన ల్యాప్ టాప్ ల స్థానంలో సిరామిక్ టైల్స్ ను పంపుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టుచేశారు. మెటల్ ప్రేమ్ లలో ల్యాప్ టాప్ లకు బదులుగా సిరామిక్ టైల్స్ ను ఉంచుతున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :ఆన్ లైన్ లో ల్యాప్ టాప్ లు బుక్ చేస్తే సిరామిక్ టైల్స్ వస్తున్నాయి. ఒకరికి కాదు ఏకంగా 45 మందికి ఇదే రకంగా ఓ గ్యాంగ్ ల్యాప్ టాప్ లకు బదులుగా సిరామిక్ టైల్స్ ను పంపిస్తున్నారు. ల్యాప్ టాప్ లకు మెటల్ ఫ్రేమ్ ల్లో సిరామిక్ ఫ్రేములను బిగించి మరీ పార్శిళ్ళను పంపుతున్నారు. ఎట్టకేలకు ఈ గ్యాంగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి 28 ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఘటన న్యూఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ లో చోటుచేసుకొంది.

ఆన్ లైన్ లో కొనుగోలు చేసే ముందు జాగ్రత్తలు తీసుకొంటాం. బహిరంగ మార్కెట్లో కంటె ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తే కొంత తక్కువధరకే వస్తువులు దొరుకుతాయి.అయితే కొన్ని వస్తువులు బహిరంగ మార్కెట్లో మాత్రం లభ్యం కావు. ఆన్ లైన్ లో మాత్రమే కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి.

వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని చాలా మందికి ఆన్ లైన్ మార్కెట్ లో వస్తువుల కొనుగోలుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే దీన్ని ఆసరాగా చేసుకొని ఓ ముఠా ఆన్ లైన్ లో ల్యాప్ టాప్ లు కొనుగోలుచేసిన వారికి ల్యాప్ టాప్ లకు బదులుగా సిరామిక్ టైల్స్ ను పంపిస్తున్నారు. ఈ రకంగా సుమారు 45 ల్యాప్ టాప్ లను వారు తీసుకొన్నారు.

trader gets ceramic tiles in sealed laptop boxes, 6 held

ఆదేశ్ కుమార్, శైలేష్ కుమార్, సుబోధ్ రాయ్, మిథున్ కుమార్, సనోజ్ కుమార్ , జయేష్ పటేల్ ముఠాగా ఏర్పడ్డారు. వీరు ల్యాప్ టాప్ లను బుక్ చేసినవారికి ల్యాప్ టాప్ లకు బదలుగా మెటల్ ప్రేమ్ లో సిరామిక్ టైల్స్ ను పంపించేవారు. ల్యాప్ టాప్ లను పార్శిల్ నుండి చోరిచేసి విక్రయించుకొంటున్నారు.

ఓ కార్గో కంపెనీ యజమాని సందీప్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ముఠాను అరెస్టు చేశారు. ఈ నెల 18వ, తేదిన శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆదారంగా పోలీసులు ఈ కేసును చేధించారు. ఈ నెల 5వ, తేదిన తమ వాహనంలో 140 ల్యాప్ టాప్ లు లోడ్ చేసి , డెలివరీకి పంపితే, వాటిలో 38 ల్యాప్ టాప్ లు , వాటి చార్జర్లు కన్పించడం లేదని ఆయన ఫిర్యాదు చేశారు.

వావానం డ్రైవర్ ఆదేశ్ కుమార్ పై పోలీసులు అనుమానంతో విచారిస్తే అసలు విషయం వెలుగుచూసింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.మిగిలిన ల్యాప్ టాప్ ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరో నిందితుడు జయేష్ కుమార్ ను అరెస్టుచేస్తే మిగిలిన ల్యాప్ టాప్ ల ఆచూకీ కూడ లభ్యమయ్యే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

English summary
six members of gang were arrested stealing laptops and selling them . police came to know of the thefts when a company received ceremic tiles frames to give them the weight and look laptops.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X