వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా..జాన్తానై: సడలింపును ఫుల్లుగా వాడేసుకుంటోన్న బెంగళూరియన్లు: బంపర్ టు బంపర్..ట్రాఫిక్ జామ్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: సిలికాన్ సిటీగా, ఉద్యాన నగరిగా పేరు తెచ్చుకున్న నగరం బెంగళూరు. పచ్చని చెట్లతో కనిపించే ఈ కర్ణాటక రాజధానికి ఓ చెడ్డపేరు కూడా ఉంది..అదే ట్రాఫిక్ జామ్. సగం జీవితం ట్రాఫిక్‌లోనే గడిచిపోతుందనేది సగటు బెంగళూరియన్ల ఆవేదన. దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే బెంగళూరులో వాహన రద్దీ అధికమని, ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే అంతే సంగతులనే వాదన మరోసారి రుజువైంది.

కరోనా కల్లోల సమయంలోనూ..

కరోనా కల్లోల సమయంలోనూ..

కరోనా కల్లోల సమయంలో కూడా బెంగళూరియన్లు తెంపరితనాన్ని ప్రదర్శిస్తున్నారు. 19 రోజుల రెండోదశ లాక్‌డౌన్‌ను సడలించడమే ఆలస్యం.. వందలాది మంది వాహనదారులు రోడ్ల మీదికి పోటెత్తారు.. పోటెత్తుతున్నారు. బంపర్ టు బంపర్ తరహాలో ట్రాఫిక్ జామ్ నెలకొంటోంది. బెంగళూరులోని కొన్ని ప్రధాన మార్గాల్లోనే కాదు.. ఇదివరకు లేని ప్రాంతాల్లో కూడా కొత్తగా ట్రాఫిక్ జామ్ నెలకొనడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.

సడలింపును ఫుల్‌గా వాడేసుకుంటున్నారు..

సడలింపును ఫుల్‌గా వాడేసుకుంటున్నారు..

రెండోదశలో అమలు చేస్తోన్న 19 రోజుల లాక్‌డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులను జారీ చేసింది. సడలింపులు అమల్లోకి వచ్చిన ఈ నెల 20వ తేదీ నుంచే వాహనాల రద్దీ ఏర్పడుతోంది. రోజురోజుకూ తీవ్రతరం అవుతూనే వస్తోంది. సడలింపును ఫుల్‌గా వాడేసుకుంటున్నారు బెంగళూరియన్లు. పని ఉన్నా లేకపోయినా రోడ్ల మీదికి వచ్చేస్తున్నారు. ఫలితంగా సాధారణ రోజుల్లో కనిపించే వాహన ప్రవాహం ఈ లాక్‌డౌన్ సమయంలోనూ కనిపిస్తోంది.

ట్రాఫిక్ జామ్ ఎక్కడెక్కడంటే..

ట్రాఫిక్ జామ్ ఎక్కడెక్కడంటే..


బెంగళూరులో ట్రాఫిక్ జామ్ అంటే ఛప్పున గుర్తుకొచ్చే ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఆదివారాలు, సెలవురోజుల్లో మినహా సాధారణ సందర్భాల్లో తెల్లవారు జాము నుంచి బాగా పొద్దు పోయేంత వరకూ ట్రాఫిక్ జామ్ ఏర్పడటం అత్యంత సహజం ఆయా ప్రాంతాల్లో. టౌన్ హాల్, మడివాళ, హెబ్బాళ, మేక్రీ సర్కిల్, శివాజీనగర, మెజస్టిక్, సర్జాపురా, కృష్ణ రాజేంద్ర సిటీ మార్కెట్, చిక్‌పేట, కళాసిపాళ్య, సిల్క్‌బోర్డు, మైసూరు రోడ్డు, రాజరాజేశ్వరి నగర, రాజాజీ నగర, కెంగేరి.. ఇలా ఒక్కటేంటి.. దాదాపు అన్ని ప్రధాన మార్గాల్లో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ నెలకొంటోంది.

 హెబ్బాళ నుంచీ ఆరంభమైతే..

హెబ్బాళ నుంచీ ఆరంభమైతే..

హెబ్బాళలో ఆరంభమయ్యే ట్రాఫిక్ జామ్.. సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆనందరావు సర్కిల్ వరకూ కొనసాగుతోంది. సిటీ బస్సులు భారీ వాహనాలేవీ లేకపోయినా.. ఆటోలు పెద్దగా తిరక్కపోయినా ఈ ట్రాఫిక్ జామ్ మాత్రం ఇంత భారీ రేంజ్‌లో నెలకొనడం.. నగర పోలీసు, ట్రాఫిక్ అధికారులను కలవరపాటుకు గురి చేస్తోంది. వాహనాల రద్దీని నియంత్రించలేక ట్రాఫిక్ కానిస్టేబుళ్లు సతమతమౌతున్నారు.

33 శాతానికి మాత్రమే అనుమతి ఉన్నా..

33 శాతానికి మాత్రమే అనుమతి ఉన్నా..


లాక్‌డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం 33 శాతానికి మాత్రమే సడలింపు ఇచ్చింది. అయినప్పటికీ.. బెంగళూరియన్లు 70 శాతానికి పైగా రోడ్ల మీదికి వస్తున్నారు. ఆ మేరకు రోడ్ల వినియోగం ఉంటోందని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. 108 అంబులెన్సులు, నిత్యావసర సరుకుల వాహనాలు సైతం స్తంభించిపోయేంతటి ట్రాఫిక్ ఏర్పడుతోంది. లాక్‌డౌన్ సడలింపు సమయాన్ని వినియోగించుకోవడానికి చిరు వ్యాపారులు, సెల్ఫ్ ఎంప్లాయిస్‌ పెద్ద సంఖ్యలో బయటికి వస్తున్నారని, ఫలితంగా ట్రాఫిక్ జామ్ అనూహ్యంగా ఏర్పడుతోందని చెబుతున్నారు.

Recommended Video

Corona Crisis : Tension In Employees Over Pay Cuts

English summary
Huge traffic jam reporter in Bengaluru after Government of India relaxed lockdown norms partially. Bengaluru still is in Red zone as number of positive cases so far as registered 91. Heavy traffic jam reported at Town Hall, Madiwala, Hebbal and other areas of the Silicon City of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X