వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: పోలీసు కాదు రాక్షసుడు, హెల్మెట్ లేదని యువకుడి తల చీల్చేసిన ఏఎస్ఐ !

హెల్మెట్ లేకుండా బైక్ లో వెళ్లిన యువకులుఅడ్డుకున్న పోలీసులు, తప్పించుకోవడానికి ప్రయత్నించారులాఠీతో తల చీల్చేసిన ఏఎస్ఐ, తీవ్రగాయాలు, పరుగు తీసిన పోలీసులు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Cop lathicharges biker for not wearing helmet, watch

చెన్నై: తమిళనాడు పోలీసులు మరోసారి తమ ప్రతాపం చూపించారు. హెల్మెట్ పెట్టుకోకపోతే రూ. 200 అపరాదరుసుం విధించాలి. లేదంటే కేసు నమోదు చెయ్యాలి. అంతే కాని చేతిలో లాఠీ ఉంది కదా అంటూ ఓ పోలీసు అధికారి రెచ్చిపోయాడు. ఏఎస్ఐ లాఠీతో అమాయకుడైన యువకుడి తల పగలగొట్టారు.

తమిళనాడులో ప్రసిధి చెందిన పర్యటక కేంద్రం కన్యాకుమారి జిల్లాలో ఈ సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. కన్యాకుమారి జిల్లా తిరువట్టారు పోలీస్ స్టేషన్ లో ఏఎస్‌ఐగా పని చేస్తున్న దేవరాజ్‌ స్థానికంగా ప్రతి రోజూ వాహనాల తనిఖీలు చేస్తుంటారు. శుక్రవారం వాహనాల తనిఖీల్లో నిమగ్నమయ్యారు.

Traffic police hits bike rider on head with lathi for not wearing helmet in Tamil Nadu

ఆ సందర్బంలో అటు వైపు ఇద్దరు యువకులు హెల్మెట్‌ లేకుండా బైక్ లో వెళ్లారు. హెల్మెట్ లేకుండా వెలుతున్న వారిని ఏఎస్ఐ దేవరాజ్ అడ్డుకునేందేకు ప్రయత్నం చేశాడు. బైక్ లో వెలుతున్న యువకులు తప్పించుకునే ప్రయత్నం చేశారు.

ఆ సందర్బంలో సహనం కోల్పోయిన ఏఎస్ఐ దేవరాజ్ తన లాఠీకి పని చెప్పాడు. యువకులు వెలుతున్న బైక్‌ను వెంబడించి వారి తల మీద లాఠీతో దాడి చేశారు. ఆ సందర్బంలో బైక్ లో వెనుక కూర్చున్న రాకేష్‌ అనే యువకుడి తలను లాఠీతో పగలకొట్టాడు.

తీవ్రస్థాయిలో రక్తం పోవడంతో రాకేష్ బైక్ లో నుంచి కిందపడి కుప్పకూలిపోయాడు. ఏఎస్‌ఐ దేవరాజ్ చర్యల్ని స్థానికులు అడ్డుకున్నారు. ఆ సందర్బంలో మరింత రెచ్చిపోయిన ఏఎస్ఐ దేవరాజ్ స్థానికుల మీద లాఠీతో దాడి చేశారు. స్థానికులు పెద్ద సంఖ్యలో గుమికూడటంతో పరిస్థితి విషమించింది.

స్థానికులు చితకబాదుతారని భయంతో ఏఎస్ఐ దేవరాజ్ అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న కన్యాకుమారి జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. తీవ్ర గాయాలైన రాకేష్ కు స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఏఎస్ఐ లాఠీతో దాడి చేసిన దృశ్యాలు సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

English summary
Bike-borne Rakesh was hit hard by the traffic police and sustained major injury to his head and was bleeding profusely. The incident took place at Kanyakumari's Kallupalam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X