వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీపావళి మిగిల్చిన విషాదం ... పండుగ సరుకుల కోసం వెళ్లి ఆరుగురి దుర్మరణం

|
Google Oneindia TeluguNews

దీపావళి పండుగ పూట విషాదం నెలకొంది. పండుగ సరుకుల కోసం వెళ్లి ఆరుగురు దుర్మరణం పాలైన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. దీపావళి పండుగ అందరి జీవితాలలో వెలుగులు నింపితే పండుగను సంతోషంగా జరుపుకోవాలనుకున్న ఆరుగురు కుటుంబాల్లో చీకటిని నింపింది. అత్యంత విషాదాన్ని మిగిల్చింది.

తమిళనాడులోని మధురై జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కోడంగినాయక్కన్‌పట్టి నుంచి దీపావళి సరుకులు కొనేందుకు 13 మంది వ్యక్తులు ఆటోలో ఉసిలంబట్టికి బయలుదేరారు. 13 మంది ప్రయాణికులతో ఆటో ఓవర్లోడ్ కావడంతో కారంబట్టి సమీపంలో వీరి ఆటోను ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొంది. దీంతో ఆటో తునాతునకలైంది.

Tragedy on Diwali time ... Going for the festive merchandise six people died in a road accident

ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారు తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. దీంతో మృతుల కుటుంబాలలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంతా సంతోషంగా దీపావళి పండుగ జరుపుకుందాం అనుకుంటే లారీ రూపంలో మృత్యువు వారిని కబళించి వేస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఘోర రోడ్డు ప్రమాదంలో పండుగ పూట ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం స్థానికులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది.

English summary
A deadly road accident in Madurai district of Tamil Nadu. Six people were died in yesterday's fatal road accident. Thirteen people set out to Ussilambatti in an auto to buy Diwali goods from Kodamginayakkanpatti. The lorry on the opposite side of the auto collided head-on with a auto overloaded with 13 passengers. six people died on the spot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X