వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్‌లో ఘోర ప్రమాదం: ట్రాక్‌పై రావణ దహనం, పైనుంచి దూసుకెళ్లిన రైలు, 61మంది మృతి

|
Google Oneindia TeluguNews

Recommended Video

Watch Video : పంజాబ్‌లో విషాదం..జనంపై నుంచి దూసుకెళ్లిన రైలు..!

అమృత్‌సర్: పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. నవరాత్రి వేడుకల్లో భాగంగా స్థానికులు జోదా ఫటక్ ప్రాంతంలోని రైల్వే ట్రాక్ పైన రావణాసురుడి దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదే సమయంలో రైలు వచ్చింది.

దీంతో పెను ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్ పైన నిలుచున్న వారి పై నుంచి రైలు దూసుకెళ్లింది. దీంతో 61 మంది ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలియగానే పోలీసులు, అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రైలు పఠాన్‌కోట్ నుంచి అమృత్‌సర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

వారి పై నుంచి దూసుకెళ్లిన రైలు

ఈ ప్రమాదం జరిగిన సమయంలో రైల్వే ట్రాక్ పైన ఐదు వందల మంది నుంచి 700 మంది వరకు ఉన్నారని తెలుస్తోంది. రావణాసురుడి హనంలో భాగంగా బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అదే సమయంలో ఒక్కసారిగా వచ్చిన రైలు వారి పై నుంచి దూసుకెళ్లింది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రుల్లో చేర్పించారు. ఎంతో ఆనందంగా దసరా వేడుకలు జరుపుకుంటున్న సమయంలో తీవ్ర విషాదం అక్కడి పరిస్థితిని భీతావహంగా మార్చింది. ఆ ప్రాంతం ఆర్తనాదాలతో నిండిపోయింది.

టపాసుల శబ్ధానికి రైలు శబ్ధం వినిపించలేదు

అమృత్‌సర్‌లోని చౌరా బజార్ ప్రాంతంలో జోడా ఫఠక్ ఉంది. వీరు టపాకాయలు కాలుస్తూ, సంబరాలు చేసుకుంటున్న సమయంలో రైలు వచ్చింది. ఆ సమయంలో రైలు హారన్ వారికి వినిపించలేదని తెలుస్తోంది. భారీ ఎత్తున టపాసులు పేలుస్తుండటంతో ఆ ధ్వని ధాటికి రైలు శబ్ధం వినిపించేదని అంటున్నారు. రైలు వేగంగా వచ్చి వారి పై నుంచి దూసుకెళ్లింది.

పంజాబ్ పోలీసులు ఏమన్నారంటే?

ఈ ప్రమాదంపై శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో పంజాబ్ పోలీసులు మాట్లాడారు. ఈ ఘటనలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని భావిస్తున్నట్లు తెలిపారు. గాయపడ్డ వారిని అక్కడి నుంచి ఆసుపత్రులకు తరలిస్తున్నామని చెప్పారు.

ప్రత్యక్షసాక్షులు ఏం చెప్పారంటే?

ఈ ప్రమాద ఘటనకు అడ్మినిస్ట్రేషన్, దసరా కమిటీ బాధ్యులు అని ప్రత్యక్ష సాక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైలు వస్తున్న సమయంలో కమిటీ సభ్యులు ప్రజలను అప్రమత్తం చేయవలసి ఉండెనని అన్నారు. రైలు ఆగుతుంది లేదా మెల్లిగా వస్తుందని తమకు నమ్మబలికారని వారు ఆరోపించారు.

డీఎంయూ రైలు వస్తుండగా దసరా వేడుకలు

సీపీఆర్వో నార్తర్న్ రైల్వే ఈ ప్రమాదంపై స్పందిస్తూ.. అమృత్‌సర్ & మానవాలా గేట్ నెంబర్ 27 వద్ద ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. దసరా పర్వదినం జరుపుకుంటుండగా ఇది జరిగిందన్నారు. డీఎంయూ రైలు నెంబర్ 74943 వస్తున్న సమయంలో గేట్ నెంబర్ 27 వద్ద దసరా వేడుకలు జరుగుతున్నాయని, ఈ సమయంలో ప్రమాదం జరిగిందన్నారు.

వేడుకలు జరుగుతుండగా వెళ్తున్న రైలు

దసరా వేడుకలు జరుగుతుండగా రైలు వేగంగా వచ్చి వారి పై నుంచి దూసుకెళ్లింది. అక్కడున్న వందలాది మందిలో ఎవరో వీడియో తీసినట్లుగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఏఎన్ఐలో వచ్చింది. అప్పటి వరకు సంబరాలు చేసుకున్న వారు హఠాత్తుగా రైలు రావడంతో అవాక్కయ్యారు. ఆ వెంటనే హాహాకారాలు వినిపించాయి. అమృత్‌సర్ సమీపంలోని చౌరా బజార్ వద్ద దసరా వేడుకలు జరుగుతుండగా డీఎంయూ రైలు వేగంగా వారిపై నుంచి వెళ్తున్న దృశ్యం.

{document1}

English summary
In a shocking and terrible disaster, more than 60 people were crushed by a train at Amritsar in Punjab on Friday while they were watching the burning of Ravan effigy on the occasion of Dussehra. The accident took place near Joda Phatak area of Choura Bazar in Amritsar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X