వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాస్తిగుడి రియల్ స్టోరి: రియల్ గానే విలన్లు పైకి (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: దునియా విజయ్ హీరోగా నటిస్తున్న మాస్తిగుడి సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ సందర్బంగా జరిగిన దుర్ఘటనలో ఇద్దరు విలన్లు జలసమాధి అయ్యారు. ఈ విషాదంతో సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది.

తిప్పగుండనహళ్ళి జలాశయంలో క్లైమాక్స్ షూటింగ్ పూర్తి అయ్యి ఉంటే ఇప్పటికి గుమ్మడికాయ కొట్టి పోస్టు ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టవలసి ఉండేది. అయితే మధ్యలోనే జరగరానిది జరిగిపోయింది.

మాస్తిగుడి సినిమా క్లైమాక్స్ షూటింగ్ సందర్బంగా హెలికాప్టర్ నుంచి కిందకు దూకే సమయంలో ఆ సినిమా విలన్లు అనీల్, ఉదయ్ జలసమాధి అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఘటన సినిమా యూనిట్ సభ్యులకు కష్టాలు తెచ్చిపెట్టింది.

మాస్తిగుడి అసలు కథ

మాస్తిగుడి అసలు కథ

మాస్తిగుడి సినిమా ఎప్పుడు, ఎక్కడ ప్రారంభం అయ్యింది, దాని కథ ఏంటి అని అందరూ ఆలోచిస్తున్నారు. నిజానికి మాస్తిగుడి ఓ రియల్ స్టోరీ. బిళగిరి రంగనతిట్ట అటవి ప్రాంతంలో నిరంతరం పులులు ఎలా చనిపోతున్నాయి ? వాటి వెనుక రహస్యం ఏమిటి అనే యదార్థ సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్నారు.

జా ట్రాప్ పులి వేటు కేసు

జా ట్రాప్ పులి వేటు కేసు

మరో కథనం ప్రకారం 1999లో మధ్యప్రదేశ్ కు చెందిన పులి వేటగాళ్లు నాగరహోళే లో వేసిన జా ట్రాప్ కు చిక్కిన పులిని అటవి శాఖ అధికారులు ఏడు రోజుల పాటు శ్రమించి రక్షించారు. అయితే పులిని రక్షించే క్రమంలో దాని కాలిని శాస్త్ర చికిత్స ద్వారా కత్తిరించారు. దక్షిణ భారతదేశంలో జా ట్రాప్ పులి వేట కేసు అప్పట్లో మొదటి సారి నమోదు అయ్యింది. ఈ కేసు ఆధారంగా మాస్తిగుడి సినిమా మొదలు పెట్టారని ప్రచారంలో ఉంది.

మూడు గెటప్స్ లో దునియా విజయ్

మూడు గెటప్స్ లో దునియా విజయ్

మాస్తిగుడి సినిమాలో హీరో దునియా విజయ్ మూడు విభిన్నమైన గెటప్స్ లో కనపడుతున్నారు. ఒక గెటప్ లో 25 ఏళ్ల యువకుడు, మరో గెటప్ లో 35 ఏళ్లు, మరో గెటప్ లో 75 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తిగా కనపడనున్నారు. ఇప్పటికే ఈ మూడు గెటప్స్ పోస్టర్లు విడుదల కావడంతో దునియా విజయ్ అభిమానులు సంతోషంగా ఉన్న సమయంలో ఈ దారుణం జరిగింది.

రిచ్ గా తీస్తున్న సమయంలో

రిచ్ గా తీస్తున్న సమయంలో

నాగరహోళే, దాండేలి తదితర ప్రాంతాల్లో ఎంతో ఖర్చు పెట్టి మాస్తిగుడి సినిమా షూటింగ్ చేశారు. అయితే సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ కోసం దాదాపు నెల రోజుల పాటు వేచి చూశారు. చివరికి తిప్పగుండనహళ్ళి దగ్గర క్లైమాక్స్ తీయ్యాలని నిర్ణయించారు.

ఇద్దరు అందాల తారలు

ఇద్దరు అందాల తారలు

మాస్గిగుడి సినిమాలో దునియా విజయ్ కి జంటగా ఇద్దరు కథానాయికలు నటిస్తున్నారు. గోల్డన్ క్వీన్ అమూల్య మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మరో కథానాయికిగా కృతి ఖరబంద నటిస్తున్నారు.

విలన్లు అంటే సిక్స్ ప్యాక్ ఉండాలి

విలన్లు అంటే సిక్స్ ప్యాక్ ఉండాలి

మాస్తిగుడి సినిమాలో విలన్లుగా అనీల్, ఉదయ్ నటించారు. ఈ సినిమా కోసం ఇద్దరూ సిక్స్ ప్యాక్ చేశారు. అటవి సంపదను లూటీ చేసే పాత్రల్లో వీరు నటించారు. మెయిన్ విలన్ గా అనీల్ కుమార్ నటించాడు.

విజయ్ తో పాటు రంగాయణ రఘు

విజయ్ తో పాటు రంగాయణ రఘు

దునియా సినిమాతో పాటు విజయ్ తో కలిసి నటిస్తున్న రంగాయణ రఘు మాస్తిగుడి సినిమాలో నటిస్తున్నారు. మాస్తిగుడి సినిమాలో తెల్లటి గడ్డం, నరిసన వెంట్రుకలతో రంగాయణ రఘు దర్శనం ఇస్తున్నాడు.

సుహాసిని, దేవరాజ్ కీలక పాత్రలు

సుహాసిని, దేవరాజ్ కీలక పాత్రలు

మాస్తిగుడి సినిమాలో బహుబాష నటి సుహాసిని కీలక పాత్రలో నటించారు. ఇక బహుబాష నటుడు దేవరాజ్ కూడా పోలీసు అధికారి పాత్రలో నటించారు.

హిట్ సినిమాలు తీశాడు

హిట్ సినిమాలు తీశాడు

కన్నడలో మైనా, సంజు వెడ్స్ గీతా తదితర సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన నాగశేఖర్ మాస్తిగుడి సినిమాను తెరకెక్కించారు.

సాధుకోకిల సంగీతం

సాధుకోకిల సంగీతం

దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత, నటుడు సాధు కోకిల మాస్తిగుడి సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఐదు పాటలు ఉన్న ఈ సినిమా ఆడియో ఇప్పటికే రూ. 45 లక్షలకు విక్రయించారు. ఈనెల చివర్లో ఆడియో రిలీజ్ చెయ్యడానికి ముందే సిద్దం అయ్యారు.

ఆరు ఫైట్లు

ఆరు ఫైట్లు

మాస్తిగుడి సినిమాలో మొత్తం ఆరు ఫైట్లు ఉన్నాయి. ఆరు ఫైట్లు థ్రిల్లింగా ఉంటాయని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ఫైట్ల శిక్షణ కోసం దాదాపుగా కొన్ని రూ. లక్షలు ఖర్చు పెట్టారు.

సుందర్ గౌడ, అనీల్ కుమార్ నిర్మాత

సుందర్ గౌడ, అనీల్ కుమార్ నిర్మాత

మాస్తిగుడి సినిమా భారీ బడ్జెట్ కావడంతో ఈ సినిమా నిర్మించడానికి సుందర్ పి.గౌడ ముందుకు వచ్చారు. మరో నిర్మాతగా ఈ సినిమా మెయిన్ విలన్ అనీల్ కుమార్ ముందుకు వచ్చారు. సుందర్. పి. గౌడ, అనీల్ కుమార్ కలిసి రూ. 15 కోట్లు ఖర్చు పెట్టి మాస్తిగుడి సినిమా నిర్మించారు.

డిసెంబర్ లో విడుదల చెయ్యాలని

డిసెంబర్ లో విడుదల చెయ్యాలని

డిసెంబర్ నెలలో మాస్తిగుడి సినిమా విడుదల చెయ్యాలని నిర్ణయించారు. అయితే క్లైమాక్స్ షూటింగ్ సందర్బంగా విషాదం చోటు చేసుకుంది. ఇప్పుడు మాస్తిగుడి సినిమా విడుదల ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

కేసులు, జైలు

కేసులు, జైలు

మాస్తిగుడి సినిమా నిర్మాత సుందర్ పి. గౌడ ఇప్పటికే జైలుపాలైనాడు. దునియా విజయ్ మీద కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలి తాత్కాలిక నిషేధాజ్ఞలు విధించింది. సినిమా దర్శకుడు నాగశేఖర్, ఫైట్ మాస్టర్ రవివర్మ మీద కేసులు నమోదు కావడంతో మాస్తిగుడి సినిమా విడుదల అయోమయంలో పడింది.

English summary
Tragedy Strikes Kannada Movie 'Maasti Gudi'. 2 Actors Drown in Tippagondanahalli Lake while shooting Climax scene on November 7th. Before tragedy took place, Anil and Uday took blessings of Duniya Vijay.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X