వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషాదం .. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూసిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Unnao : ఉన్నావ్ అత్యాచార బాధితురాలు కన్నుమూసింది, సమాజం ఎటు పోతుంది ?

ఉన్నావ్ అత్యాచార బాధితురాలు కన్నుమూసింది. అత్యాచారం చేసిన నిందితుడు కిరోసిన్ పోసి తగలబెట్టిన ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో మృతి చెందింది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌కు చెందిన అత్యాచార బాధితురాలు 90 శాతం కాలిన గాయాలతో తీవ్ర నరకాన్ని చూసి, అదే సమయంలో గుండెపోటుతో ఆమె తుదకు కన్నుమూసింది. ఆసుపత్రిలో చేరిన ఆమె పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు.

అత్యాచార బదితురాలిపై కక్ష పెంచుకున్న నిందితుడు

అత్యాచార బదితురాలిపై కక్ష పెంచుకున్న నిందితుడు

గతేడాది డిసెంబరులో బాధితురాలు అత్యాచారానికి గురైంది. పెళ్లి చేసుకుంటాం అన్న పేరుతో నమ్మించి తన స్నేహితులతో కలిసి నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్యాంగ్ రేప్ చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పట్లో ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు గత నెల 25న విడుదలయ్యాడు. బయటకు వచ్చిన నిందితుడు తనను జైలుకు పంపిన ఆమెపై కక్ష పెంచుకున్నాడు.

కిరోసిన్ పోసి సజీవ దహనం .. చికిత్స పొందుతూ మృతి

కిరోసిన్ పోసి సజీవ దహనం .. చికిత్స పొందుతూ మృతి


ఆమెను హతమార్చాలని నిర్ణయం తీసుకున్నాడు . ఆమెను హతమార్చేందుకు స్నేహితులతో కలిసి పక్కా స్కెచ్ వేసాడు. అత్యాచారం కేసులో రాయ్‌బరేలీ కోర్టుకు హాజరయేందుకు గురువారం ఆమె గ్రామం నుంచి బయలుదేరగా ఐదుగురు నిందితులు కాపుకాసి ఆమెను అడ్డగించి ఆమెపై దాడిచేశారు. కిరోసిన్ పోసి నిప్పు అంటించారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే హెలికాప్టర్ ద్వారా ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించినా, ఆమెను కాపాడడానికి వైద్యులు ఎంతగా ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. అక్కడ చికిత్స పొందుతూ గత అర్ధరాత్రి ఆమె తుదిశ్వాస విడిచింది.

 దాడిలో పాల్గొన్న వారి అరెస్ట్ .. పోలీసుల దర్యాప్తు

దాడిలో పాల్గొన్న వారి అరెస్ట్ .. పోలీసుల దర్యాప్తు


అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న శివం త్రివేది, శుభం త్రివేదీ కూడా ఉన్నావ్ అత్యాచార బాధితురాలి సజీవ దహనానికి యత్నించిన వారిలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గురువారం ఉదయం జరిగిన దాడిలో పాల్గొన్న ఐదుగురు వ్యక్తులను గంటల్లోనే పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
సామూహిక అత్యాచారం జరిగి, ఊహించని విధంగా అది జరిగిన సంవత్సరం తర్వాత సజీవ దహనానికి గురైంది ఉన్నావ్ బాధితురాలు.

జైల్లో ఉన్నా పశ్చాత్తాపం లేని నిందితులు

జైల్లో ఉన్నా పశ్చాత్తాపం లేని నిందితులు

ఇంత కాలం జైల్లో ఉన్నా, పశ్చాత్తాపంలేని మానవమృగాలు బయటకు వచ్చిన తర్వాత కక్ష కట్టి మరీ ఆమెపై మూకుమ్మడి దాడి చేశారు. దేశాన్ని కదిలించిన కేసులో బాధితురాలు రెండు రోజులు మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూసింది. తన కేసులో నేరస్థులకు పడే శిక్షలు చూడకుండానే బాధితురాలు తనువు చాలించింది. కామాంధుల దాష్టీకానికి బలైపోయింది. ఈ ఘటన దేశం మొత్తాన్ని ప్రస్తుతం కదిలించి వేస్తోంది.

English summary
The 23-year-old woman, who was set ablaze by some men, the accused who raped her in Unnao, Uttar Pradesh has died at Safdarjung Hospital in Delhi on Friday night. Reportedly the victim had suffered 90 per cent burns and died of a cardiac arrest at the Safdarjung Hospital at 11:40 pm on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X