వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: ఐసీయూ ఛార్జీల ఎత్తివేతకు ట్రాయ్ సుముఖం, తగ్గనున్న మొబైల్ బిల్లులు

ఐసీయూ చార్జీలను ఎత్తివేసేందుకు ట్రాయ్ సుముఖంగా ఉంది.ఐసీయూ చార్జీలను జీరో చేయడానికి ట్రాయ్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో‌కు టెలికం రెగ్యులేటరీ శుభవార్త చెప్పనుంది.వివాదాస్పదమైన 14 పైసల ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ చార్జీలను దశలవారీగా రద్దు చేయాలనే ప్రతిపాదనను ట్రాయ్ పరిగణనలోకి తీసుకొనే అవకాశం కన్పిస్తోంది.ఐసీయూ చార్జీలను ఎత్తివేస్తే మొబైల్ బిల్లులు మరింత తగ్గే అవకాశం ఉంది.

రిలయన్స్ జియో మార్కెట్లోకి రావడమే సంచలనాలతో ప్రారంభమైంది, ఉచి ఆఫర్లతో జియో ప్రత్యర్థులకు చుక్కలను చూపింది.

జియో కారణంగా ఇతర టెలికం కంపెనీలు కూడ తమ టారిఫ్ ధరలను మార్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జియో ఉచిత ఆఫర్లతో టెలికం పరిశ్రమ పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వచ్చిందని నిఫుణులు అంచనా వేశారు.

తాజాగా ఫీచర్‌ఫోన్‌తో మార్కెట్లోకి మరో సంచలనాన్ని సెప్టెంబర్ 1వ, తేది నుండి ప్రవేశపెట్టనుంది. ఆగష్టు 24వ, తేది నుండి ఫీచర్‌ఫోన్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.

ఇంటర్‌కనెక్ట్ ఛార్జీలపై కోతకు అవకాశం

ఇంటర్‌కనెక్ట్ ఛార్జీలపై కోతకు అవకాశం

వివాదాస్పదమైన 14 పైసల ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జీలను దశలవారీగా రద్దు చేయాలనే ప్రతిపాదనను ట్రాయ్ పరిగణనలోకి తీసుకొంటుంది. తొలుత 7 శాతం (50 శాతం) కోత పెట్టనున్నట్టు ట్రాయ్ వర్గాల నుండి సమాచారం. అనంతరం మరో 3 పైసలను కూడ కోత విధించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇంటర్‌కనెక్ట్ ఛార్జీలను జీరోకు తీసుకురావాలని ట్రాయ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Recommended Video

JIO Shocking Decission On Free Offers | Oneindia Telugu
.ఈ నెలాఖరులో ఐయూసీ ఛార్జీలపై తుది నిర్ణయం

.ఈ నెలాఖరులో ఐయూసీ ఛార్జీలపై తుది నిర్ణయం

ఈ నెలాఖరులో ఐయూసీ ఛార్జీలపై రెగ్యులేటరీ నుండి తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే ఐయూసీ రద్దు చేసినా లేదా తగ్గించినా టెలికం సంస్థల ఆదాయం తగ్గిపోతోందని ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా వాదిస్తున్నాయి. రిలయన్స్ జియో మాత్రం ఐయూసీ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఈ విషయమై ఈ నెలాఖరులో తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

ఐయూసీ రద్దుతో సేవింగ్స్ పెంచుకోనున్న జియో

ఐయూసీ రద్దుతో సేవింగ్స్ పెంచుకోనున్న జియో

ఐయూసీ రద్దుతో జియో తన సేవింగ్స్‌ను పెంచుకొంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని కారణంగా ధరల యుద్దానికి మరింత తెరలేచే అవకాశం ఉందని ఆపరేటర్లు ఆందోలన చెందుతున్నారు. ప్రస్తుతం జియోకు 100 మిలియన్ సబ్‌స్క్రైబర్లున్నారు. ఐయూసీ రద్దు చేస్తే ఇతర ఆపరేటర్లు ఈ ఏడాదిలో రూ.6,720 కోట్ల ఆదాయాన్ని వదులుకోవాల్సి వస్తోంది.

ఐయూసీ తగ్గిస్తే నష్టాలు

ఐయూసీ తగ్గిస్తే నష్టాలు

ఐయూసీని 3 పైసలుగా చేస్తే ఇంక్యుబెంట్స్‌కు ఏడాదిలో రూ.5,290 కోట్లు నష్టం వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 7 పైసలకు తగ్గించినా రూ.3,360 కోట్లను వదులుకోవాల్సి వస్తోంది. టెలికం నెట్‌వర్క్ నుండి మరో టెలికం నెట్‌వర్క్‌కు కాల్ వెళ్ళిన సమయంలో నెట్‌వర్క్‌కు చెల్లించే మొత్తాన్ని ఐయూసీ ఛార్జీగా వ్యవహరిస్తున్నారు.ప్రస్తుతం ఇది నిమిషానికి 14 పైసలుంది. ఐయూసీల ద్వారా ఎయిర్‌టెల్, ఐడియాలకు 14 శాతం దేశీయ వైర్‌లెస్ ఆదాయం సమకూరుతోంది. ఐసీయూలను రద్దు చేస్తే మొబైల్‌ ఫోన్ల బిల్లులు తగ్గనున్నాయి.

English summary
Telecom Regulator TRAI is actively considering a proposal to completely phase out the controversial 14 paise interconnect usage charge (IUC) beginning with a sharp 50% cut to 7 paise .the regulator is analysing the impact of first cutting the IUC to 7 paise, then to 3 paise and then bringing it to zero.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X