వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక 11 అంకెల సెల్ ఫోన్ నంబర్లు- మార్పుతో వెయ్యికోట్ల నంబర్లు- ట్రాయ్ సంచలన సిఫార్సు...

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా సెల్ ఫోన్ నంబర్ల లభ్యత, కనెక్టివిటీతో పాటు ఇతరత్రా సమస్యలను దృష్టిలో ఉంచుకుని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ట్రాయ్ ఆపరేటర్లకు చేసిన పలు సిఫార్సులు టెలికాం రంగంలో పెను విప్లవం సృష్టించేలా ఉన్నాయి. ఇవి అమల్లోకి వస్తే కోట్లాది మందిపై ప్రభావం పడనుంది. వీటిలో 11 అంకెల సెల్ ఫోన్ నంబర్లతో పాటు పలు కీలక సిఫార్సులు ఉన్నాయి. వీటిని అమల్లోకి తెచ్చేందుకు ఇప్పుడు ఆపరేటర్లు కసరత్తు చేస్తున్నారు.

Recommended Video

TRAI Recommends 11-Digit Mobile Numbers In The Country

వైఎస్ జగన్‌కు హోంమంత్రి అమిత్ షా ఫోన్: కరోనాపై ఏపీ సీఎం వివరణవైఎస్ జగన్‌కు హోంమంత్రి అమిత్ షా ఫోన్: కరోనాపై ఏపీ సీఎం వివరణ

 దేశవ్యాప్తంగా కనెక్టివిటీ...

దేశవ్యాప్తంగా కనెక్టివిటీ...

మన దేశంలో ట్రాయ్ లెక్కల ప్రకారం ఈ ఏడాది మార్చి 31 నాటికి దాదాపు 118 కోట్ల సెల్ ఫోన్లు, ల్యాండ్ లైన్ ఫోన్ల సబ్ స్క్రైబర్లు ఉన్నారు. వీరిలో 117 కోట్ల మంది కేవలం సెల్ ఫోన్ వాడుతున్నారు. మిగతా కోటి మంది ల్యాండ్ ఫోన్లు వాడుతున్నారు. దేశవ్యాప్తంగా వివిద రాష్ట్రాల్లో ఉన్న వీరిలో సెల్ ఫోన్ వాడే వారంతా కనెక్టివిటీ కోసం స్ధానికంగా ఉన్న సెల్ ఫోన్‌ టవర్లపైనే ఆధారపడుతున్నారు. వీటి రేడియేషన్ ఎక్కువ కావడం, ఇతరత్రా సమస్యల కారణంగా కనెక్టివిటీలో ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు నంబర్ల లభ్యత, ఇతరత్రా సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో వీటి పరిష్కారం కోసం ట్రాయ్ కొంతకాలంగా పలు అధ్యయనాలు నిర్వహిస్తోంది.

 ట్రాయ్ సిఫార్సులు- 11 అంకెల నంబర్లు...

ట్రాయ్ సిఫార్సులు- 11 అంకెల నంబర్లు...

దేశవ్యాప్తంగా సెల్ ఫోన్ నంబర్ల లభ్యత పెంచడం, కనెక్టివిటీ, ఇతరత్రా సమస్యల నివారణ కోసం ట్రాయ్ తాజాగా మొబైల్ ఆపరేటర్లకు పలు కీలక సిఫార్సులు చేసింది. ఇందులో ప్రస్తుతం సెల్ ఫోన్లకు ఉన్న 10 అంకెల మొబైల్ నంబర్ స్ధానంలో 11 అంకెల నంబర్లుగా మార్చడం, కొత్తగా జారీ చేసే నంబర్లను కూడా 11 అంకెల్లోనే జారీ చేయడం. అదే సమయంలో వీటిని 9 అంకెతోనే ప్రారంభమయ్యేలా ఉంచడం. ఈ మార్పులతో దేశవ్యాప్తంగా వెయ్యికోట్ల మొబైల్ నంబర్లు అందుబాటులోకి వస్తాయని ట్రాయ్ తన సిఫార్సుల్లో పేర్కొంది.

 ల్యాండ్ నంబర్ల విషయంలో...

ల్యాండ్ నంబర్ల విషయంలో...

సెల్ ఫోన్ నంబర్లకు ఆరంభ సంఖ్యను 9ని కొనసాగిస్తూనే వీటిని డయల్ చేసేందుకు ల్యాండ్ లైన్ యూజర్లకు మాత్రం ముందు సున్నా చేర్చాలని ట్రాయ్ సిఫార్సు చేస్తోంది. అలాగే డేటా కనెక్టివిటీ కోసం వాడుతున్న డాంగిల్స్‌ కోసం 13 అంకెల నంబర్లను కేటాయించాలని ట్రాయ్ సూచించింది. ఇప్పటివరకూ డాంగిల్స్ కు కూడా సెల్ ఫోన్ సిమ్ లను వాడుతున్నందున వాటికి కూడా 10 అంకెల నంబర్లనే కేటాయిస్తున్నారు. కానీ త్వరలో వీటిని 13కు పెంచాలని ట్రాయ్ సూచించింది.

 ఆచరణ సాధ్యమేనా ?

ఆచరణ సాధ్యమేనా ?

ప్రస్తుతం ఉన్న 10 అంకెల సెల్ ఫోన్ నంబరును 11కు పెంచడం, డాంగిల్స్ కు 13కు పెంచడం ఆచరణలో ఎంతవరకూ సాధ్యమనే చర్చ జరుగుతోంది. నంబర్ల మార్పులో పెద్ద నోట్ల రద్దు తరహాలో రాత్రికి రాత్రే ఇలాంటి మార్పులు చేస్తే ఓ సమస్య, సుదీర్ఘంగా కొనసాగిస్తే మరిన్ని సమస్యలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కసరత్తంతా ఒకేసారి పూర్తవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశంలో కోట్లాది మంది సెల్ ఫోన్ నంబరును ఫీడ్ చేసుకోకుండానే నేరుగా డయల్ చేస్తున్నారు. ఇలాంటి వారికి కొత్తగా మరో నంబర్ ను గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. అది మరికొన్ని కొత్త సమస్యలకు దారి తీసే ప్రమాదముంది. దీంతో ఆపరేటర్లు వీటిపై ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

English summary
telecom regulatory authority of india trai suggests 11 digit mobile numbers in the country to overcome existing number scarcity issues. as per trai's suggestions if number starts with 9 more than 1000 cr numbers will be avaialble more.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X