వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెటాప్‌ బాక్సు మార్చకుండానే మరో ఆపరేటర్‌కు మారొచ్చు: ట్రాయ్ ప్లాన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ వినియోగదారులు తమకు నచ్చిన నెట్వర్క్‌లోకి నెంబరు మార్చకుండానే మారే అవకాశం ఉంది. దీన్నే నెంబర్ పోర్టబులిటీ అని పిలుస్తున్నాం. అంటే ప్రస్తుత నెట్‌వర్క్ బాగోలేదని భావిస్తే మరో నెట్‌వర్క్‌కు మారొచ్చు. ప్రతిసారీ కొత్త హ్యాండ్‌సెట్ కొనాల్సిన పనిలేదు. ఈ పద్ధతి మార్కెట్‌లో గత కొంతకాలంగా నడుస్తోంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. అయితే డీటీహెచ్‌తో మాత్రం అలా లేదు. ఒక ఆపరేటర్‌పై ఉన్న వినియోగదారుడు మరో ఆపరేటర్‌కు మారాలంటే మళ్లీ కొత్త సెటాప్ బాక్స్ కొనాల్సి ఉంది. ఇప్పడు మొబైల్ పోర్టబులిటీలానే డీటీహెచ్‌‌లో కూడా పోర్టబులిటీని తీసుకురావాలనే యోచనలో ట్రాయ్ ఉంది.

 సెటాప్ బాక్స్ మార్చుకుండానే మరో ఆపరేటర్‌కు

సెటాప్ బాక్స్ మార్చుకుండానే మరో ఆపరేటర్‌కు

మొబైల్ నెంబర్ మారకుండా హ్యాండ్ సెట్ మార్చకుండా మరో నెట్‌వర్క్‌కు మారుతున్నాం. ఇదే పద్ధతిని డీటీహెచ్‌కు కూడా ఇంప్లిమెంట్ చేయాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) యోచిస్తోంది. ఒకే సెటాప్ బాక్స్ వినియోగించి నచ్చిన ఆపరేటర్‌కు వినియోగదారుడు మారేలా వీలు కల్పించేందుకు ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తొలిదశ టెస్టింగ్‌ కూడా పూర్తి చేసినట్లు సమాచారం. దీంతో ఆపరేటర్ మార్చే ప్రతీసారి కొత్త సెటాప్ బాక్స్‌ కొనుగోలుకు అవసరం లేకుండా పోతుంది.

డబ్బు ఆదా..ఆపరేటర్లలో పెరగనున్న పోటీతత్వం

డబ్బు ఆదా..ఆపరేటర్లలో పెరగనున్న పోటీతత్వం

ముందుగా వినియోగదారుడు ఒక ఆపరేటర్‌కు చెందిన సెటాప్ బాక్స్ కొని ఆ తర్వాత మరో ఆపరేటర్‌కు మారాలంటే ఇదే సెటాప్ బాక్స్ వినియోగించి మారే అవకాశం ఉంటుందని వెల్లడించింది ట్రాయ్. దీనివల్ల వెంటనే చేకూరే లాభం ఏమిటంటే.. ముందుగా కొత్త సెటాప్‌బాక్స్‌ కొనుగోలు చేసే డబ్బులు ఆదా అవుతాయి. అంతేకాదు ఇన్స్‌టాలేషన్ చార్జీలు కూడా తగ్గుతాయి. ఇక ఆపరేటర్లు కూడా కొత్త ప్లాన్లతో ముందుకు వస్తాయని ట్రాయ్ యోచిస్తోంది. ఇక కొత్త సెటాప్ బాక్సలు వాటి ప్లాన్లతో డీటీహెచ్ రంగంలో పోటీతత్వం ఏర్పడుతుందని వెల్లడించింది. దీంతో కొత్త టెక్నాలజీలు ఆవిష్కరించబడుతాయని యోచనలో ట్రాయ్ ఉన్నట్లు సమాచారం. అంటే పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ, వేగవంతం లాంటి అంశాలు మెరుగుపడుతాయని వెల్లడించింది.

 ఎప్పటికప్పుడు కొత్త సేవలను అందిస్తున్న డీటీహెచ్ ఆపరేటర్లు

ఎప్పటికప్పుడు కొత్త సేవలను అందిస్తున్న డీటీహెచ్ ఆపరేటర్లు

ప్రస్తుతం డీటీహెచ్ రంగంలో చాలా ఆపరేటర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్‌లు కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై టీవీ ఛానెళ్లను అందిస్తున్నాయి. ఉదాహరణకు ఎయిర్‌టెల్ హైఎండ్ సెటాప్ బాక్స్ 4కే స్ట్రీమింగ్‌ మరియు హెచ్‌డీ ఛానెల్స్‌ను సపోర్టు చేస్తోంది. ఇక ఈ మధ్యే కొత్తగా లాంచ్ అయిన రిలయన్స్ జియో ఒక అడుగు ముందుకేసి హోమ్ నెట్‌వర్క్‌ స్టోరేజ్ సేవలు, కౌడ్ గేమింగ్ సేవలు జియో ఫైబర్ సెటాప్ బాక్స్ ద్వారా అందిస్తోంది.

English summary
Interoperable Set-Top Boxes are being tested by TRAI and they should be rolled out by next year. DTH subscribers won’t have to buy new boxes while changing operators.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X