పెళ్ళి జరగాల్సిన ఇంట్లో ఏం జరిగిందంటే

ఆదివారం తెల్లవారజామున జరిగిన ఇండోర్ - పాట్నా ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం ఓ పెండ్లి ఇంట్లో విషాదాన్ని నింపింది. ఈ విషాదం కారణంగా రూబీ గుప్తా అనే 20 ఏళ్ళ యువతి చేయి విరిగింది.

న్యూడిల్లీ :ఆదివారం తెల్లవారజామున జరిగిన ఇండోర్ - పాట్నా ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. పదిరోజుల్లో పెళ్ళి జరగాల్సిన ఇంట్లో ఈ ప్రమాదం విషాదాన్ని నింపింది. వివాహం కోసం తీసుకెళ్తున్న బంగారం, డబ్బుతో ఇతర వస్తువులు కన్పించకుండాపోయాయి. వధువు చేయి విరిగిపోయింది. వధువు తండ్రి ఆచూకీ లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో వివాహం చేసుకోబోనని ఆమె చెబుతోంది.

ఇండోర్ నుండి ఆజంఘర్ లోని మావూకు ఇండోర్ - పాట్నా ఎక్స్ ప్రెస్ రైలు లో 20 ఏళ్ళ రూబీ గుప్తా తన కుటుంబసభ్యులతో కలిసి వెళ్తోంది. డిసెంబర్ 1వ, తేదిన ఆమె వివాహం. వివాహనికి కావాల్సిన బంగారం, డబ్బులు, ఇతర వస్తువులను తీసుకొని తండ్రి రామ్ ప్రసాద్ గుప్తా, తమ్ముళ్ళు ఇతర కుటుంబసభ్యులతో కలిసి ఆమె ప్రయాణీస్తోంది. ఈ ప్రయాణం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.

 train accident effect on marriage

తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంతొో రూబీ గుప్తా చేయి విరిగింది. ఈ ప్రయాణంలో ఆమెతో పాటు ఆమె కుటుంబసభ్యులంతా సురక్షితంగా బయటపడ్డారు.కాని, తండ్రి ఆచూకీ కన్పించలేదు.

పెళ్ళికోసం తెచ్చుకొన్న బంగారం, బట్టలు, ఇతర వస్తువులు కూడ దొరకలేదు. తన తండ్రి ఆచూకీ కోసం స్థానికంగా ఉన్న ఆసుపత్రి మార్చురీ వద్ద, ఆసుపత్రిలో క్షతగాత్రులను చేర్చిన ఆసుపత్రుల్లో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. తన తండ్రి ఆచూకీ కోసం ఆమె వెతుకుతోంది.ఇలాంటి సమయంలో తనకు వివాహం చేసుకోవాలని లేదంటోంది ఆమె.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+