వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

5 నిమిషాల ముందు కూడా రైల్వే టికెట్.. రేపటినుంచి అందుబాటులోకి: ఇండియన్ రైల్వే..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వల్ల వ్యవస్థలు స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. అయితే ప్రజా రవాణాకు క్రమంగా అనుమతిస్తున్నారు. బస్సులు, ప్రత్యేక రైళ్ల సేవలు పునరుద్ధరించారు. అయితే రేపటి నుంచి ట్రైన్ సర్వీసుకు సంబంధించి మరో వెసులుబాటు వచ్చింది. ఇదివరకటీ మాదిరిగా రైల్వే సేవలు వచ్చాయని రైల్వేశాఖ తెలిపింది.

Recommended Video

Indian Railways : Train Tickets Will Available 5 Minutes Before Departure From Tomorrow || Oneindia

నిర్దేశిత స్టేషన్ నుంచి రైలు బయల్దేరే సమయానికి 5 నిమిషాల ముందు కూడా సీట్లు లభిస్తాయని రైల్వేశాఖ తెలిపింది. అరగంట ముందు కూడా సెకండ్ రిజర్వేషన్ చార్ట్ అందుబాటులో ఉంచుతామని రైల్వేశాఖ తెలిపింది. కరోనా వైరస్ వల్ల రైల్వే ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ నడుపుతున్న సంగతి తెలిసిందే.

Train tickets to be available 5 minutes before departure from tomorrow

స్టేషన్ నుంచి రైలు బయలుదేరే 30 నిమిషాల ముందు రెండో రిజర్వేషన్ చార్ట్ రూపొందిస్తారు. అయితే ఇదీ కరోనా వైరస్ వల్ల మాత్రమే తయారుచేస్తున్నారు. ఇదివరకు మాత్రం 2 గంటల ముందు షెడ్యూల్ చేసేవారు. అలాగే రెండో రిజర్వేషన్ చార్ట్ తయారు చేసేవరకు కూడా టికెట్లను విక్రయిస్తారు. అంటే రైలు బయల్దేరే సమయం కన్నా 5 నిమిషాల ముందు.. రెండో చార్జ్ తయారు చేసిన 30 నిమిషాల నుంచి కూడా టికెట్లను విక్రయిస్తారు. ఇదివరకు కూడా టికెట్లను ఇచ్చేవారు. కానీ సైరన్ పడితే మాత్రం టికెట్ ఇచ్చేందుకు నిరాకరించేవారు.

రైలు బయల్దేరే సమయానికి 4 గంటల ముందు మొదటి రిజర్వేషన్ చార్ట్ తయారు చేస్తారు. అయితే ఎవరైనా సీట్లను క్యాన్సిల్ చేసుకుంటే.. వాటిని పీఆర్ఎస్ కౌంటర్ల ద్వారా రెండో చార్జ్ ద్వారా భర్తీ చేస్తారు. అయితే రెండో చార్జీ తయారు చేసే సమయంలో కూడా టికెట్లను క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ టికెట్ ధరకు సంబంధించి రీ ఫండ్ నిబంధనల మేరకు అలా అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

English summary
railway seats will be available even five minutes before the train leaves the station in October 10 onwards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X