• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పేలుళ్ల ఉగ్రవాది.. బాంబు పెట్టి సెల్ఫీ: బంగారం స్వాధీనం, ఎవరీ అతీఫ్?

|

లక్నో: మధ్యప్రదేశ్‌లో భోపాల్ - ఉజ్జయిని ప్యాసింజర్ రైలులో పేలుడుకు పాల్పడిన ముష్కరుడు సైఫుల్లాను హతమార్చినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. సంఘటన స్థలం నుంచి బాంబు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఆ దేశ ద్రోహి శవం కూడా మాకొద్దు: పేలుళ్ల ఉగ్రవాది తండ్రి, 'ఉగ్రవాది కోసం పోలీసుల ఫోన్'ఆ దేశ ద్రోహి శవం కూడా మాకొద్దు: పేలుళ్ల ఉగ్రవాది తండ్రి, 'ఉగ్రవాది కోసం పోలీసుల ఫోన్'

సైఫుల్లా మృతి చెందాడని చెప్పిన పోలీసులు

సైఫుల్లా మృతి చెందాడని చెప్పిన పోలీసులు

సైఫుల్లా ఎదురు కాల్పుల్లో మృతి చెందారన్నారు. అతనికి లొంగిపోయేందుకు చాలా సమయం ఇచ్చామని తెలిపారు. నిందితులు స్వచ్చంధంగా ఐసిస్ వైపు వెళ్లారన్నారు. సంఘటన స్థలం నుంచి 8 పిస్టల్స్, 600 క్యాట్రిడ్జులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భారీగా బంగారం, నగదు, 3 పాస్ పోర్టులు గుర్తించినట్లు చెప్పారు.

సూత్రధారి సెల్ఫీ!

సూత్రధారి సెల్ఫీ!

మరోవైపు, రైలులో బాంబు పెట్టిన సూత్రధారి అతిఫ్ ముజఫర్.. దాంతో ఫొటో తీసుకుని, ఇతరులకు పంపించాడు. భోపాల్-ఉజ్జయిని ప్యాసింజర్ రైలులో మంగళవారం ఉదయం జరిగిన పేలుడుకు సూత్రధారి అతిఫ్ ముజఫర్‌ రాక్షసత్వం కలిగినవాడు.

ఖోరసాన్ మాడ్యుల టెర్రర్ సంస్థ చీఫ్.. ఐసిస్‌కు లింక్

ఖోరసాన్ మాడ్యుల టెర్రర్ సంస్థ చీఫ్.. ఐసిస్‌కు లింక్

మీడియాలో వస్తున్న వార్తల మేరకు.. ఖొరసాన్ మాడ్యూల అనే ఉగ్రవాద బృందానికి అతిఫ్ ముజఫర్ నాయకత్వం వహిస్తున్నాడు. దీనికి తనను తాను చీఫ్‌గా ప్రకటించుకున్నాడు. ఇది ఐసిస్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పని చేస్తోంది.

భారీ దాడులే లక్ష్యం

భారీ దాడులే లక్ష్యం

తొమ్మిది మంది సభ్యులు గల ఖొరసాన్ మాడ్యూల్ కార్యకలాపాలు ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దుల్లో జరుగుతున్నాయి. కొత్తగా ఫైటర్లను చేర్చుకుని, మరింత విస్తరించి, ఈ ప్రాంతంలో భారీ దాడులు చేయాలన్నది ఖొరసాన్ లక్ష్యం.

ప్రత్యేక శైలిలో..

ప్రత్యేక శైలిలో..

ఈ సంస్థ కార్యకలాపాలు ప్రత్యేక శైలిలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. అలీగఢ్‌కు చెందిన అతిఫ్ ముజఫర్‌కు అల్ ఖాసిం అనే పేరు కూడా ఉంది. అతను ఇంజినీరింగ్ చదివాడు.

అరెస్ట్

అరెస్ట్

అతనితో పాటు ఉజ్జయిని రైలులో టైమర్ పైప్ బాంబ్‌ను అమర్చిన డానిష్ అక్తర్, సయ్యద్ మిర్ హుస్సేన్‌లను మంగళవారం మధ్యాహ్నం 1.30గంటలకు మధ్యప్రదేశ్ ఏటీఎస్ అరెస్టు చేసింది.

ఫోన్లో ఆధారాలు

ఫోన్లో ఆధారాలు

హోషంగాబాద్ జిల్లాలోని పిపరియా వద్ద బస్సు నుంచి దిగుతుండగా వీరు పట్టుబడ్డారు. అతిఫ్ వద్దనున్న మొబైల్ ఫోన్‌ను పరిశీలించినపుడు విలువైన ఆధారాలు పోలీసులకు లభించాయి.

ఫోటోలు తీసుకొని పంపించాడు..

ఫోటోలు తీసుకొని పంపించాడు..

రైలులో బాంబును అమర్చుతూ ఫొటో తీసుకుని, కొందరికి పంపించేందుకు ఈ మొబైల్‌ ఫోన్‌ను వాడినట్లు పోలీసులు తెలిపారు. ఖొరసానాకు డిప్యూటీ కమాండర్లుగా డానిష్‌, మహ్మద్ సైఫుల్ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

మృతి చెందాడు

మృతి చెందాడు

వీరిలో సైఫుల్ మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని ఠాకూర్‌గంజ్‌లో ఏటీఎస్ దాడిలో మరణించాడు. రష్యన్ డెవలపర్ రూపొందించిన టెలిగ్రామ్ అనే మెసేజింగ్ యాప్‌లో యూజర్ల ప్రైవసీకి గట్టి భద్రత ఉంటుంది. ఇస్లామిక్ ఉగ్రవాదులు అత్యధికంగా ఈ యాప్‌నే ఉపయోగించుకుంటున్నారు. ఖొరసానా ముఠా కూడా ఈ యాప్‌నే వాడుతున్నట్లు తెలుస్తోంది.

English summary
ISIS Flag, Train Time Table Found Near Terror Suspect's Body In Thakurganj Near Lucknow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X