వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రాన్స్ జెండర్లకు శుభవార్త: పాన్‌కార్డులో కొత్త ఆఫ్షన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆధార్- పాన్ అనుసంధానంలో ట్రాన్స్‌జెండర్ల సమస్యకు పరిష్కారం లభించింది. పాన్‌కార్డులో థర్డ్‌జెండర్ ఆఫ్షన్ కల్పిస్తూ ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు సోమవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే పాన్‌కార్డు ధరఖాస్తులో ట్రాన్స్ జెండర్లను ప్రత్యేక కేటగిరీగా గుర్తించిన కేంద్రం వారికోసం ఈ ప్రత్యేక ఆప్షన్‌ను కేటాయించింది. స్త్రీ, పురుషుల మాదిరిగా ట్రాన్స్‌జెండర్లకు ఓ ఆప్షన్‌ను కేటాయిస్తూ ఆదాయ పన్ను శాఖ నిబంధనలను ప్రభుత్వం సవరించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను సీబీడీటీ సోమవారం విడుదల చేసింది.

Transgenders to be recognised as independent gender category in PAN form

ఆధార్‌తో పాన్ అనుసంధానం సమయంలో ట్రాన్స్ జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.అయితే ఈ సమస్యను పరిష్కరిస్తున్నట్టుగా సీబీడీటీ సోమవారం నాడు నోటీఫికేషన్ విడుదల చేసింది. పాన్ కోసం దరఖాస్తు చేసే ట్రాన్స్‌జెండర్ల కోసం దరఖాస్తు ఫారంలో ప్రత్యేకంగా ఓ టిక్ బాక్స్‌ను ఏర్పాటు చేశారు.

ఆధార్‌-పాన్‌ అనుసంధానంలో హిజ్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి కారణం ఆధార్‌ కార్డులో జెండర్‌ ఎంపికలో ఆడ, మగతోపాటు హిజ్రాలకు ప్రత్యేకంగా థర్డజెండర్‌ ఆప్షన్‌ ఉన్నప్పటికీ పాన్‌ కార్డు దరఖాస్తులో ఆ వెసులుబాటు లేదు. ఆధార్‌కార్డుల్లో థర్డ్‌ జెండర్‌ అనీ, పాన్‌కార్డుల్లో మాత్రం పురుషుడు/మహిళ అని ఉండటంతో హిజ్రాలు తమ ఆధార్‌ నంబర్లను పాన్‌కు అనుసందించేందుకు ఇబ్బందులు పడ్డారు.

English summary
The government has amended Income Tax rules that will now allow transgenders to be recognised as an independent category of applicants for obtaining a Permanent Account Number (PAN) for their tax-related transactions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X