చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోస్ట్ గార్డ్ విమానం: సముద్రంలో ఆనవాళ్లు

|
Google Oneindia TeluguNews

చెన్నై: చెన్నైలో సోమవారం గల్లంతైన కోస్టు గార్డ్ విమానం కోసం అధికారులు చేపట్టిన గాలింపులో కొన్ని ఆనవాళ్లు లభించాయి. సోమవారం రాత్రి 9గంటల తర్వాత రాడార్ నుంచి సంబంధాలు తెగిపోయిన ఈ విమానం కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్, నేవీ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

కాగా, విమానానికి సంబంధించిన సిగ్నళ్లను శనివారం గుర్తించారు. ఇప్పటికే దీని ఆచూకీలో తలమునకలైన ఐఎన్ఎస్ సంధ్యక్.. డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ రాడార్ సంకేతాలను గుర్తించటన్లు కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. సముద్ర నీటి ఉపరితలంపై మల్టీ కలర్‌లో ఉన్న ఆయిల్ మరకలను కూడా గుర్తించినట్లు చెప్పారు.

crew

వీటిని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపామని తెలిపారు. విమానం కూలిపోయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. తమిళనాడు తీరంలో ఉన్న పాల్క్ బే వద్ద నిఘా కోసం ఈ విమానం.. చెన్నై కోస్ట్ గార్డ్ స్టేషన్ నుంచి బయలుదేరి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.

aircroft

ఈ విమానం కోసం 10 ఇండియన్ కోస్ట్ గార్డ్ ఓడలు, 4 నావికా దళాలు గాలింపులో ఉన్నాయని ఇండియన్ నేవీ అధికార ప్రతినిధి కెప్టెన్ డికె శర్మ ఇప్పటికే ప్రకటించారు. గల్లైంతన విమానంలో డిప్యూటీ కమాండెంట్(పైలట్) విద్యాసాగర్, కో పైలట్, డిప్యూటీ కమాండెంట్ సుభాష్ సురేష్, నావిగేటర్ ఎంకె సోనీ ఉన్నారు.

English summary
The Indian Coast Guard officials said on Saturday that INS Sandhyak, undertaking sub-surface search for the missing Dornier, has detected intermittent transmission of 37.5 Khz, likely to be from the Sonar Locator Beacon (SLB) of the aircraft.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X