వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రావెల్ బ్యాన్: ఎంపి రవీంద్ర పై బ్యాన్ విధించిన ఎయిర్ లైన్స్ సంస్థలు

ఎయిరిండియా సిబ్బందిపై దాడిచేసిన శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్ కు చేదు అనుభవం ఎదురౌతోంది.ఎయిరిండియా సిబ్బందిపై ఎంపి దాడి చేసిన ఘటనతో ఇతర విమానయాన సంస్థలన్నీ ఆయనను తమ విమానాల్లో

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: అమెరికాలోనే కాదు ఇండియాలో కూడ ట్రావెల్ బ్యాన్ ఘటనలు చోటుచేసుకొంటున్నాయి.శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్ వ్యవహరించిన తీరును నిరసిస్తూ తమ విమానాల్లో ప్రయాణించకుండా బ్యాన్ ను విధించాయి.
ఎయిరిండియా సిబ్బందిపై దాడిచేసిన శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్ కు చేదు అనుభవం ఎదురౌతోంది.ఎయిరిండియా సిబ్బందిపై ఎంపి దాడి చేసిన ఘటనతో ఇతర విమానయాన సంస్థలన్నీ ఆయనను తమ విమానాల్లో ప్రయాణానికి అనుమతించడం లేదు.

ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తూ కేబిన్ సిబ్బందిలో ఒకరిపై 25 సార్లు చెప్పుతో కొట్టాడు శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్.అయితే ఈ ఘటన పట్ల నిరసనగా పలు విమానాయాన సంస్థలు రవీంద్ర గైక్వాడ్ ను తమ సంస్థల్లో ప్రయాణించకుండా నిషేధం విధించాయి.

travel ban on shiva sena mp ravindra gaikwad by several airlines

విస్తారా, ఇండిగో, జెట్ ఎయిర్ వేస్, స్పైస్ జెట్ , గో ఎయిర్ లాంటి సంస్థలు ఆయనపై నిషేధం విధించాయి. రవీంద్ర గైక్వాడ్ ను తమ విమానాల్లో తీసుకెళ్లబోమని ఆ సంస్థలు ప్రకటించాయి.

రవీంద్ర గైక్వాడ్ నుండి క్షమాపణ ఆశించడం లేదని ఆయా సంస్థలు ప్రకటించాయి. ఒకవేళ రవీంద్రగైక్వాడ్ క్షమాపణ చెబితే ఆయనను తమ విమానాల్లో ఎక్కించుకోవాల్సి వస్తోందని ఎఫ్ఐఏ తెలిపింది.

శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు రవీంద్ర గైక్వాడ్ బుక్ చేసుకొన్న టిక్కెట్ ను ఎయిరిండియా రద్దు చేసింది. దీంతో ఆయన సాయంత్రం ఇండిగో విమానంలో టిక్కెట్టును బుక్ చేసుకొన్నారు.అయితే ఇండిగో కకూడ ఆయన టిక్కెట్ ను రద్దుచేసి ఛార్జీలను ఇచ్చేసింది.

దీంతో ఆయన రైలు లేదా బస్సులలో మాత్రమే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.స్వంతంగా ఆయన విమానాన్ని బుక్ చేసుకోవాలి. ఎయిర్ ఏషియా లాంటి సంస్థలు కూడ తమకు మద్దతుగా నిలుస్తాయనే అభిప్రాయంతో మిగిలిన సంస్థలు ఉన్నాయి.

సుకుమార్ అనే ఎయిరిండియా సిబ్బందిని 25 సార్లు చెప్పుకొట్టినట్టుగా ఎంపి రవీంద్ర గైక్వాడ్ చెప్పాడు. ఆయనపై రెండు ఎఫ్ ఐ ఆర్ లు నమోదయ్యాయి.

ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో దాడులకు పాల్పడిన వారికి విమానంలోనే బేడీలు వేసే అధికారం ఉంది.అయితే ఈ ఘటన సరిగా విమానం దిగే సమయంలో జరిగింది. తమ సిబ్బందిలో ఎవరిపై దాడి జరిగినా అది తమ మీద దాడి జరిగినట్టుగానే భావిస్తున్నామని ఎయిరిండియా అధికారులు చెబుతున్నారు.

తమ పట్ల దురుసుగా ప్రవర్తించే ప్రయాణీకుల జాబితాతో నో ఫ్లై జాబితాను తయారు చేస్తామని, వాళ్ళను విమానాల్లోకి అనుమతించబోబని అంటున్నారు. ప్రభుత్వం కూడ ఈ రకమైనవారికి నియంత్రించాలని కోరుతోంది.

English summary
travel ban on shiva sena mp ravindra gaikwad by several airlines after unruly dehaviour. air india , indigo airlines cancelled ravindra tickets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X