వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఫ్గాన్‌లో భూకంపం: ఉత్తర భారత్‌లో ప్రకంపనలు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈశాన్య అఫ్గనిస్తాన్‌లోని పాకిస్తాన్, కజికిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి భూకంపం సంభవించింది. దీని తీవ్ర రెక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. ఈ భూకంప ప్రమాదంలో 17 మంది గాయపడ్డారని యుఎస్ జియోలాజికల్ సర్వే శనివారంనాడు వెల్లడించింది.

భూమి కంపించడతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భయంకరమైన చలిలో ప్రజలు రాత్రంతా బయటనే జాగారం చేశారు. భూకంప కేంద్రాన్ని 203 కిలోమీటర్ల లోతులో కనుక్కున్నట్లు తెలిపారు. ఈ భూకంపం ప్రభావం భారత్‌లోనూ పాకిస్తాన్‌లో కనిపించింది.

Earthquake

భారత్‌లోని హిమాలయ పర్వత ప్రాంతంలోని రాష్ట్రాలతో పాటు న్యూఢిల్లీలో కూడా స్వల్పంగా భూమి కంపించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భారత్‌లోని చండీఘడ్, జైపూర్, ఢిల్లీ సహా ఇతర సమీపం ప్రాంతాల్లో భారీ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

భారతదేశంలో అర్థరాత్రి దాటిన తర్వాత 12.44 గంటలకు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించిన దాఖలాలు లేవు.ఢిల్లీలోని ప్రజలు ప్రకంపనలతో భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జమ్మూ కాశ్మీరులో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

English summary
moderate intensity earthquake, with epicentre in Hindu Kush region of Afghanistan, on Friday night shook Delhi, Jammu & Kashmir and other parts of North India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X