వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోచింగ్ లేకుండా మెడికల్ సీట్ సాధించిన గిరిజన బాలిక: అందుకే అద్భుతం

By Srinivas
|
Google Oneindia TeluguNews

నయా రాయపూర్: చత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా నక్సలైట్ ప్రభావిత ప్రాంతం అని తెలిసిందే. ఇక్కడి విద్యార్థులు చదువుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడతారు. ఈ జిల్లాలో ఎవరిని 'మీ స్కూల్లో ఈ రోజు టీచర్ ఉన్నారా' అని అడిగితే దాదాపు 'లేరు' అని సమాధానం వస్తుంది. మావోల ప్రాభల్యం ఉన్న ఈ ప్రాంతంలో అడుగు పెట్టేందుకు టీచర్లంతా భయపడతారు.

ఇలాంటి జిల్లా నుంచి ఓ అమ్మాయి అద్భుతం సాధించింది. మాయా కష్యప్ అనే దోర్నపాల్‌కు చెందిన విద్యార్థిని కోచింగ్‌కు వెళ్లకపోయినా నీట్ పరీక్ష రాసి ఎంబీబీఎస్ సీటు సాధించింది.

Tribal girl first from Maoist hit Dornapal to get medical seat

ఇక్కడి ప్రాంతానికి తోడు ఆమె కూడా ఎన్నో ఇబ్బందులు పడింది. అందుకే ఆమె సీటు సాధించడం అద్భుతమే. తొమ్మిదేళ్ల క్రితం తండ్రి చనిపోయాడు. భారం తల్లిపై పడింది. నలుగురి సంతానంలో ఒకరైన ఆ బాలిక చదువు కొనసాగించడం కష్టమైంది.

కానీ డాక్టర్‌ కావాలన్న తన లక్ష్యంతో ఆమె ఎన్నో కష్టాలను ఓర్చింది. నీట్‌కు ఎలాంటి శిక్షణ తీసుకోకుండా, ఒకవేళ సీటొస్తే ఫీజులు చెల్లించడానికి డబ్బులకు ఏం చేయాలో కూడా తెలియని స్థితిలో ఆమె ఎంబీబీఎస్ సీటును పొందింది.

చత్తీస్‌గఢ్‌ నుంచి నీట్ రాసిన 12,315 మంది ఎస్టీ విద్యార్థుల్లో ఆమె 154వ ర్యాంకు సాధించింది. అంబికాపుర్‌ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందింది. ఆమె నీట్‌లో ర్యాంకు తెచ్చుకున్న తర్వాత కుటుంబం ఎంతో సంతోషపడింది. అదే సమయంలో ఫీజులకు ఏం చేయాలంటూ ఆందోళనకూ లోనైంది. ఆమె పెద్దన్నయ్య అనుప్ ఓ స్నేహితుడి నుంచి అప్పు తెచ్చాడు. వదిన రత్న కష్యప్ బంధువుల నుంచి కొంత నగదు తీసుకొచ్చారు. మాయా కశ్యప్ మాట్లాడుతూ.. డాక్టర్ కావాలనేది చిన్నప్పటి నుంచి తన కోరిక అని చెప్పింది.

English summary
Is masterji in school today? The answer, almost every day, was no. No teacher dared step into this Maoist affected zone of Sukma. Yet, a tribal girl has become the first from the region to make it to a medical college and that too without any coaching or a clue about where her admission fees would come from.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X