వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లవర్‌తో సెక్స్‌చేస్తుండగా..: 12మందితో రేప్.. జరగలేదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Girl
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని బీర్భం జిల్లాలో ఇరవై ఏళ్ల గిరిజన యువతిపై సామూహిక అత్యాచారం జరిగిందన్న ఆరోపణలను గిరిజన నేతలు కొట్టి పారేస్తున్నారు. మరో సామాజిక వర్గానికి చెందిన యువకుడితో సంబంధం పెట్టుకుందనే ఆరోపణపై గ్రామ కంగారూ కోర్టు తీర్పు మేరకు ఓ యువతిపై 12 మంది సామూహిక అత్యాచారం జరిపారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిని ఆ ప్రాంత గిరిజన నాయకులు ఖండిస్తున్నారు.

అసలు గ్యాంగ్ రేప్ ఘటనే జరగలేదని చెబుతున్నారు. అత్యాచారం జరిగిందని చెప్తున్న గిరిజన యువతి గ్రామ పెద్ద గురించి అబద్ధాలు చెప్పిందని, అంతేకాకుండా మీడియా కూడా తమ సంతాల్ తెగ పాటిస్తున్న సంప్రదాయ తీర్పుల విధానాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

పశ్చిమ బెంగాల్‌లోని వివిధ జిల్లాలకు చెందిన సుమారు 20 మంది సంతాల్ సంస్థల నాయకులు ఆదివారం మహమ్మద్ బజార్ ప్రాంతంలోని అంగర్‌గారియా గ్రామంలో సమావేశమై తమ అంతర్గత న్యాయ వ్యవస్థను మీడియా చిత్రీకరిస్తున్న తీరుపై తమ నిరసనను తెలియజేశారు.

‘భరత్ జకత్ మఝి మరోవా' సంస్థ బీర్‌భూమ్ జిల్లా విభాగం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సంతాల్ గిరిజన తెగ నాయకులు, విద్యార్థి నాయకులు, మేధావులతో పాటుగా గ్యాంగ్ రేప్ ఘటన జరిగినట్లుగా చెప్తున్న లాభ్‌పూర్ గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు కూడా హాజరయ్యారు. వందలాది సంవత్సరాలుగా కొనసాగుతున్న గ్రామ సభలు తీర్పు చెప్పే తమ తెగ విధానానికి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తామని సంతాల్ నేతలు చెప్పారు.

బీర్భం జిల్లా లాభ్‌పూర్ గ్రామంలో ఇలాంటి గ్రామ సభ ఇచ్చిన ఆదేశాలపై ఒక గిరిజన మహిళపై 12 మంది గ్రామస్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై వారు స్పందిస్తూ.. గ్రామంలోని ఒక ఇంట్లో ఆ మహిళ, ఆమె ప్రియుడు శృంగారం చేస్తూ సన్నిహితంగా ఉండగా గ్రామస్థుల కళ్లబడ్డంతో ఆ ఇద్దరినీ ఇంట్లోంచి బైటికి లాగడం నిజమేనని కానీ గ్రామ పెద్ద పంచాయతీ నిర్వహించడం కానీ, యువతిపై సామూహిక అత్యాచారం జరపాలని ఆదేశించడం కానీ జరగలేదని గిరిజన నేతలు చెప్పారు.

ప్రభుత్వం గిరిజన సంప్రదాయ న్యాయ వ్యవస్థను నాశనం చేయడానికి, తమ వ్యవస్థలో గ్రామ పెద్ద అధికారాలను కాలరాయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇతర తెగల్లోని ఇలాంటి వ్యవస్థలను, లేదా వివాహ చట్టాలను ప్రశ్నించకుండా తమ న్యాయ వ్యవస్థను మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ చర్యపై మొత్తం గిరిజనులు తిరగబడతారని, అత్యాచారం జరిగినట్లుగా చెప్తున్న గ్రామంలో తాము భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు.

English summary
Tribal leaders in Birbham district a 20 year old girl was allegedly gangraped recently have stuck to the claim that the girl had lied to frame the morol and the media was defaming the traditional justice system of the Santhal community.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X