వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిత్రమైన దొంగతనం..! విచిత్రిమైన తీర్పు..! హడలిపోయిన దొంగ..!!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : కొన్ని కేసుల్లో తీర్పు గమ్మత్తుగా ఉంటుంది. కోర్ట్ తీర్పును విన్న తర్వాత సదరు నేరస్తుడు ఎందుకు ఈ నేరం చేసానురా బాబూ అని తల పట్టుకుని కూర్చునే పరిస్థితి నెలకొంటుంది. అచ్చం ఇలాంటి ఘటనే ఢిల్లీలో చోటుచేసుంది. ఓ చోరీ కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడుని 50 మొక్కలు నాటలని ఆదేశించింది. ఇక కేసు తీర్పు వివరాలు ఇలా ఉన్నాయి.

ఒక వ్యక్తి ఢిల్లీలో చోరీ కేసులో కోర్టులో విచారణ ఎదురుకుంటున్నాడు. ఈ విచారణలో ఢిల్లీ హైకోర్టు50 మొక్కలు నాటలని ఆదే సరైన శిక్షగా భావించింది. అందుకు ఒప్పుకుంటే అతనిపై ఉన్న చోరీ కేసు విచారణను రద్దు చేస్తామని ప్రకటించింది. ఐతే అందులో కొన్ని షరతులు ఉన్నాయి. నెలరోజుల్లో మొక్కలు పాతాలనీ, పశ్చిమ అటవీశాఖ డిప్యూటీ కన్సర్వేటర్, సెంట్రల్ రిడ్జ్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఎక్కడ మొక్కలు పాతమంటే అక్కడ పాతాలని ఆదేశించింది. అంతేకాదు ప్రతీ మొక్క వయసూ 3 నుంచీ 3న్నర ఏళ్లకుపైగా ఉండాలనీ, మొక్క ఎత్తు దాదాపు 6 అడుగులు ఉండాలని ఆర్డరేసింది.

Tricky theft.! The strange verdict..! The dreaded thief..!!

అంతే కాకుండా ఏ మొక్కలు పాతాలో డిప్యూటీ కన్సర్వేటర్ చెబుతారని జస్టిస్ ఆదేశమిచ్చారు. గులార్, కదంబ, పిల్ఖాన్, జామూన్, మర్రి, మామిడి, అమల్టాస్, మహువా, పుత్రంజివా, బాధ్, సంగ్వాన్, సఫెద్ సిరిస్, కాలా సిరిస్, అంజీర్, కథల్, జాక్‌ఫ్రూట్, పలాష్ అర్నీ, బిస్తెందు, రొహిందా, మెడ్షింగీ జాతి మొక్కల్ని నాటాలని హైకోర్టు ఆదేశించింది.అంతే కాకుండా మొక్కల్లో ఒక్కటి తగ్గినా తిరిగి చోరీ కేసు విచారణ మొదలవుతుందని స్పష్టం చేసింది. మొక్కలు నాటాక వాటిని ఫొటోలు తీసి, పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇవ్వాలని డిప్యూటీ కన్సర్వేటర్‌ను కోర్టు కోరింది. ఆరు నెలలపాటూ మొక్కల్ని పెంచాలనీ, ఆ తర్వాత వాటిని ఫొటోలు తీసి మరో రిపోర్ట్ ఇవ్వాలని క్లారిటీగా చెప్పింది. ఇవి అన్ని విన్న ఆ దోషి మొక్కలు నాటడం కంటే డబ్బులు కట్టిందే నయం అనుకున్నాడు.

ఇంతకీ అతనిపై ఉన్న చోరీ కేసు ఏంటంటే... ఎలక్ట్రిసిటీ చోరీ. తన షాపు నుంచీ ఓ వైరు... ఎలక్ట్రిక్ స్తంభానికి సెట్ చేసి ఉండటంతో... ఎలక్ట్రిసిటీ అధికారులు అతను కరెంటు చోరీ చేస్తున్నాడని కేసు పెట్టారు. దీంతో కరెంటు డిపార్ట్‌మెంట్ 18,267 రూపాయలు చెల్లించాలని కోరింది. అలాంటిదేమీ లేదన్న అతను... కోర్టులో కేసు దర్త్యాప్తును నిలిపివేయాలని కోరాడు. కానీ ట్రయల్ కోర్టు... అతనికి శిక్ష విధించింది. ఆ శిక్షను నిలిపివేసిన హైకోర్టు... మొక్కలు నాటే శిక్ష (మంచి శిక్ష) వేసింది. ఇలాంటి కేసులో దర్యాప్తు కొనసాగించడం వల్ల కలిసొచ్చేది పెద్దగా ఏమీ ఉండదన్న హైకోర్టు... అందుకే మొక్కలు నాటాలని కోరినట్లు తెలిపింది.ఇక చివరగా అతడు మొక్కలు నాటడం కంటే ఎలక్ట్రిసిటీ బిల్లు చెల్లిండమే తనకు బెటరనుకోని మొత్తం బిల్లు చెల్లించాడు.

English summary
The High Court has issued a verdict in a Chori case. The accused has been ordered to plant 50 plants. The verdict of the case is as follows. A man is facing trial in a court in theft case in Delhi. In this trial, the Delhi High Court considers the 50 plants to be the correct punishment. If it is agreed, the Chori case on him has been announced to cancel the hearing. But there are some conditions in it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X