వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేతిలో తుపాకీ, బైక్ ర్యాలీలో నేత : సోషల్ మీడియాలో ట్రోలవుతోన్న టీఎంసీ నేత చేష్ట

|
Google Oneindia TeluguNews

కోల్ కతా : ఎన్నికల వేళ నేతలు, అనుచరుల చేష్టలు మితిమీరిపోతున్నాయి. గీత దాటొద్దని ఈసీ హెచ్చరిస్తోన్నా .. కొందరు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో ఓ టీఎంసీ కార్యకర్త రోడ్ షోలో తుపాకీ పట్టుకొని హల్ చల్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

200 బైకులతో ర్యాలీ
బిర్భూమ్ లోక్ సభ నియోజకవర్గానికి టీఎంసీ సిట్టింగ్ ఎంపీ శతాబ్ది రాయ్ పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి దుద్ కుమార్ మండల్ బరిలో ఉన్నారు. అయితే నియోజకవర్గంలోని సైంతియా వద్ద 200 బైకులతో ర్యాలీ తీశారు. ర్యాలీ ఓకే గానీ .. అందులో ఓ కార్యకర్త మాత్రం చేతిలో తుపాకీ పట్టుకొన ఉన్నాడు. ఎన్నికలు జరుగుతున్నాయి. కోడ్ అమల్లో ఉందనే భయం లేకుండా .. హీరోలా తుపాకీ పట్టుకొని ఫోజిచ్చాడు. ఈ ర్యాలీ తీసింది టీఎంసీ ఏరియా అధ్యక్షుడు ప్రశాంత్ మోండల్ అని పోలీసులు గుర్తించారు.

Trinamool Congress worker caught on camera brandishing a gun in Birbhum

మూడోవిడత పోల్‌లో హింస
నిన్న జరిగిన మూడో విడత ఎన్నికల్లో బెంగాల్‌లో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భీర్బూమ్‌లో టీఎంసీ కార్యకర్త తుపాకీతో సంచరించడం కలకలం రేపుతోంది. దీనిని ఈసీ సుమోటోగా తీసుకొని చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ఇలాంటి ఘటనలను .. మీడియా వార్త కథనాల ద్వారా సుమోటోగా తీసుకొని చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.

English summary
A shocking video has surfaced, showing a worker - purportedly affiliated to the West Bengal Chief Minister Mamata Banerjee’s Trinamool Congress - brandishing a gun during a roadshow in the Birbhum Lok Sabha constituency. The bike rally was taken out by around 200 TMC workers. The video, which shows a pillion passenger with a gun in his hand without any fear of law, was shot in Sainthia which comes under Birbhum constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X