వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభ ఆమోదం పోందిన ట్రిపుల్ తలాక్ బిల్లు.. అనుకూలంగా 99, వ్యతిరేకంగా 84

|
Google Oneindia TeluguNews

రాజ్యసభలో ఎట్టకేలకు ట్రిపుల్ తలాక్ బిల్లు పాస్ అయింది. ఇప్పటికే లోక్‌సభలో ప్రవేశపెట్టి పాస్ చేయించుకున్న కేంద్రం రాజ్యసభలో కూడ మెజారీటీ సభ్యుల ఓటింగ్‌తో పంతం నెగ్గించుకుంది. ఉదయం నుండి జరిగిన చర్చల అనంరతం బిల్లుపై విపక్షాలు డివిజన్ కోరాయి. బిల్లుపై జరిపిన ఓటింగ్ జరిగిన నేపథ్యంలోనే ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 84 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లు అమల్లోకి రానుంది. ఇక ఇప్పటి నుండి దేశంలో ట్రిపుల్ తలాక్ చట్టరిత్యా నేరంగా పరిగణించనున్నారు. ముస్లీం మహిళలకు త్రిపుల్ తలాక్ చెప్పిన భర్తలకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించనున్నారు.

కాగా అంతకు ముందు బిల్లుపై ప్రతి పక్ష పార్టీలతోపాటు సభ్యులు ఏడు సవరణలు కోరాయి,అందులో ముఖ్యంగా బిల్లును సెలక్ట్ కమీటీకి పంపించాలని కోరింది. దీంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సవరణలపై కూడ ఓటింగ్ నిర్వహించాడు. దీంతో సవరణలకు సంబంధించి కూడ ఓటింగ్ లో కూడ ప్రభుత్వానికి అనుకూలంగా 100 , వ్యతిరేకంగా 84 ఓట్లు వచ్చాయి.

Triple talaq bill passed in Rajya Sabha

ట్రిపుల్ తలాక్ బిల్లు పార్లమెంట్‌లో నెగ్గిన తర్వాత మంగళవారం రాజ్యసభలో న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రవేశపెట్టారు. కాగా బిల్లుపై చర్చ చేపట్టిన నేపథ్యంలో అధికార పార్టీ మిత్రపక్షమైన జేడీయూ బిల్లును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ ఎంపీ కేసీ త్యాగీ వాకౌట్ చేశారు. అనంతరం పలు పార్టీలు తమ అభిప్రాయాలను తెలిపాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలకు వైసీపీ బిల్లును వ్యతిరేకించగా టీఆర్ఎస్ పార్టీ బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసింది.

English summary
Voting on Muslim Women (Protection of Rights on Marriage) Bill, 2019 is underway in the Rajya Sabha. Disposal of reference of amendment of th bill to the select committee has been rejected with 84 'Ayes' and 100 'Noes'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X