వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు లోక్‌సభకు ట్రిపుల్ తలాక్ బిల్లు..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : నరేంద్రమోడీ నేతృత్వంలో కొలువుదీరిన ఎన్డీయే సర్కారు తొలి బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది. ముస్లిం మహిళల రక్షణ కోసం రూపొందించిన ట్రిపుల్ తలాక్ బిల్లును న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ సభ ముందు ఉంచనున్నారు. ముస్లిం మహిళలకు ముమ్మారు తలాక్ ఇవ్వడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించే ఈ బిల్లుకు ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ బిల్లు 2019గా నామకరణం చేశారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే ట్రిపుల్ తలాక్ చెప్పడం క్రిమినల్ నేరం అవుతుంది.

పార్లమెంట్‌లో వందేమాతరం, భారత్ మాతాకి జై అనకూడదని ఎవరు చెప్పారు..? స్పికర్ ఓం బిర్లాపార్లమెంట్‌లో వందేమాతరం, భారత్ మాతాకి జై అనకూడదని ఎవరు చెప్పారు..? స్పికర్ ఓం బిర్లా

 జూన్ 12 కేబినెట్ ఆమోదం

జూన్ 12 కేబినెట్ ఆమోదం

ముస్లిం మహిళల సాధికారత కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మోడీ సర్కారు ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకొచ్చింది. జూన్ 12న జరిగిన సమావేశంలో ఈ బిల్లుకు కేబినెట్ ఆమోదం లభించింది. ముమ్మారు తలాక్ చెప్పిన భర్తకు జైలు శిక్ష విధించాలన్న నిబంధనపై ప్రతిపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో గతంలో రాజ్యసభలో ఈ బిల్లు నిలిచిపోయింది. దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపి ప్రతిపక్షాల అభ్యంతరాలు, సూచనల్ని పరిగణలోకి తీసుకొని కొత్త బిల్లు రూపొందించారు. ట్రిపుల్ తలాక్‌కు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండోసారి ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారు. మరో 40రోజుల్లో ఆర్డినెన్సు కాలం చెల్లనుండటంతో ఆలోపు పార్లమెంటు ఆమోదం పొందాలని మోడీ సర్కారు కృత నిశ్చయంతో ఉంది.

16వ లోక్‌సభ రద్దుతో మళ్లీ బిల్లు

16వ లోక్‌సభ రద్దుతో మళ్లీ బిల్లు

వాస్తవానికి గత లోక్‌‍సభలోనే ట్రిపుల్ తలాక్ బిల్లును మోడీ సర్కారు తీసుకొచ్చింది. అయితే లోక్‌సభ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రాజ్యసభ ఆమోదం పొందలేకపోయింది. నిబంధనల ప్రకారం లోక్‌సభ రద్దైతే ఉభయ సభల ఆమోదం పొందని బిల్లులకు కాలదోషం పడుతుంది. ఒకవేళ బిల్లు లోక్‌సభ ఆమోదం పొంది రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్నా లోక్‌సభ రద్దైన పక్షంలో ఆ బిల్లులు కూడా వాటంతట అవే రద్దయి పోతాయి. ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలోనూ ఇదే జరిగింది.

 ఆర్డినెన్స్ తెచ్చిన కేంద్రం

ఆర్డినెన్స్ తెచ్చిన కేంద్రం

ముస్లిం మహిళలకు విడాకుల విషయంలో జరుగుతున్న అన్యాయంపై స్పందించిన ఎన్డీఏ ప్రభుత్వం గతేడాది ట్రిపుల్ తలాక్ బిల్లును సభలో ప్రవేశపెట్టింది. 2018 సెప్టెంబర్‌ దానికి లోక్‌సభ ఆమోదం తెలిపినా.. ప్రతిపక్షాల అభ్యంతరాలతో రాజ్యసభ ఆమోద ముద్ర వేయించు కోలేకపోయింది. కేంద్రం ముస్లిం ఉమెన్ ఆర్డినెన్స్‌ 2019ను తీసుకొచ్చింది. దీని ప్రకారం భారత్‌లో ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్దం. దాన్ని అతిక్రమించిన వారికి మూడేళ్ల జైలు శిక్ష విధించేలా ఆర్డినెన్స్‌లో నిబంధనలు విధించారు.

English summary
Triple Talaq Bill will be the first bill to be introduced by the Narendra Modi government in the 17th Lok Sabha.Law Minister Ravi Shankar Prasad will introduce The Muslim Women Protection of Rights on Marriage Bill 2019 on Friday aimed at protecting the rights of married Muslim women and to prohibit divorce by pronouncing talaq by their husbands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X