వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రిపుల్ తలాక్ బిల్లు నేడు రాజ్యసభ ముందుకు..! ఈ సారైనా పాస్ అవుతుందా..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బీజేపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లును నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఈ బిల్లు లోక్‌సభలో పాస్ అయ్యింది. లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే సభ్యుల నిరసనల మధ్యే ఈ బిల్లను పాస్ చేశారు. ఇప్పటికే అధికార బీజేపీ పార్టీ తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఎంపీలంతా సభకు హాజరుకావాలని ఆదేశించింది.

ముస్లిం మహిళలకు రక్షణగా నిలువాలనే ఉద్దేశంతోనే ఈ బిల్లును తీసుకొస్తున్నట్లు బీజేపీ చెబుతోంది. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తన భార్యకు మూడు సార్లు తలాక్ చెబితే అతనికి జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించడం జరుగుతుందని బిల్లులో పొందుపర్చారు. రెండవ సారి బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తొలి ముసాయిదా బిల్లును సభలో ప్రవేశపెడుతున్నారు. పలు పార్టీలు బిల్లను వ్యతిరేకించినప్పటికీ.... బిల్లు సమానత్వంను కలగజేయడంతో పాటు సామాజిక న్యాయం కూడా చేకూరుస్తుందని ప్రభుత్వం చెబుతోంది.

Triple talaq bill to be tabled in Rajyasabha

ఇదిలా ఉంటే బిల్లను పార్లమెంటరీ కమిటీకి పంపాలని విపక్షాలు కోరుతున్నాయి. లోక్‌సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ రావడంతో అక్కడ బిల్లు సులభంగా పాస్ అయ్యింది. అయితే రాజ్యసభలో మాత్రం బిల్లును పాస్ చేయించేందుకు కష్టపడాల్సి ఉంటుంది. ఇక్కడ పూర్తిస్థాయిలో బీజేపీకి సంఖ్యబలం లేదు. పైగా తన మిత్రపక్షం అయిన జేడీయూ ఈ బిల్లను వ్యతిరేకిస్తుండటం విశేషం.

English summary
The government has listed the contentious triple talaq bill for consideration and passage in the Rajya Sabha on Tuesday.The bill has already been passed by the Lok Sabha by a voice vote amidst a walkout by Congress, Samajwadi Party, Trinamool Congress, DMK and others. The bill was passed by the 16th Lok Sabha but could not pass the Rajya Sabha hurdle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X