వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభలో ట్రిపుల్ తలాక్‌ బిల్లు, వాకౌట్ చేసిన జేడీయూ

|
Google Oneindia TeluguNews

ట్రిపుల్ తలాక్ బిల్లు పార్లమెంట్‌లో నెగ్గిన తర్వాత రాజ్యసభలో న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రవేశపెట్టారు. కాగా బిల్లుపై చర్చ చేపట్టిన నేపథ్యంలో అధికార పార్టీ మిత్రపక్షమైన జేడీయూ బిల్లును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ ఎంపీ కేసీ త్యాగీ వాకౌట్ చేశారు. దీంతో పలు పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

లోక్‌సభలో నెగ్గిన ట్రిపుల్ తలాక్ బిల్లు,

లోక్‌సభలో నెగ్గిన ట్రిపుల్ తలాక్ బిల్లు,

ఆందోళనల నడుమ రాజ్యసభలో ట్రిబుల్ తలాక్ బిల్లును న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రవేశపెట్టారు. కాగా లోక్‌సభలో వ్యతిరేకించిన రాజకీయ పక్షాలు, రాజ్యసభలో కూడ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. అయితే ప్రతిపక్షాల వ్యతిరేకత ఉన్నా అధిక మెజారిటి ఉన్న బీజేపీ 303 ఓట్ల మెజారీటీతో బిల్లును నెగ్గించుకుంది. కాగా బిల్లును వ్యతిరేకిస్తూ 82 మంది ఓటు వేశారు. కాగా మరి కొన్ని ప్రాంతీయ పార్టీలు సభకు దూరంగా ఉన్నాయి.

అధికార పక్షానికి మేజారిటి లేని రాజ్యసభ

అధికార పక్షానికి మేజారిటి లేని రాజ్యసభ

అయితే రాజ్యసభలో మాత్రం బిల్లను నెగ్గించుకునందుకు పూర్తి మెజారిటి అధికార ప్రక్షానికి లేదు. మొత్తం 245 మంది రాజ్యసభ సభ్యుల్లో అధికార కూటమి బిల్లు నెగ్గాలంటే 121 మంది మద్దతు పలకాల్సి ఉంటుంది. అయితే అధికార పక్షం బలం మిత్రపక్షాలతో కలిపి 103 మాత్రమే ఉంది. కాగా అందులో జేడీయూకు చెందిన 6 గురు ఎంపీలు బిల్లును వ్యతిరేకిస్తున్నారు. బిల్లుకు వ్యతిరేకంగా 110 మంది ఉన్నట్టు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల పార్టీలపై బిల్లుపై సస్పెన్స్

తెలుగు రాష్ట్రాల పార్టీలపై బిల్లుపై సస్పెన్స్

ఇక బిల్లుపై తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీల్లో టీఆర్ఎస్‌కు 6 స్థానాలు ఉండగా,వైసీపీకి 2, టీడీపీ 2 స్థానాలు ఉన్నాయి. కాగా టీఆర్ఎస్ మాత్రం బిల్లు మద్దతుపై ఊగిసలాడుతోంది. టీఆర్ఎస్ బిల్లును వ్యతిరేకించకపోయినా అందులో ఉన్న కొన్ని నిబంధనలును మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ట్రిబుల్ తలాక్‌ చెప్పిన వారికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తే భార్యలను ఎవరు పోషిస్తారన్న ప్రశ్నలను లేవనెత్తుతున్నారు.

బిల్లును నెగ్గించుకునేందుకు కొత్త వ్యూహం

బిల్లును నెగ్గించుకునేందుకు కొత్త వ్యూహం

మరోవైపు బిల్లును నెగ్గించుకునేందుకు కేంద్రం పావులు కదుపుతున్న నేపథ్యంలోనే పార్లమెంట్‌లో జేడీయు లాంటీ పార్టీలు చర్చకు దూరంగా ఉండి ప్రభుత్వానికి సహకరించనున్నాయి.ఇందులో భాగంగానే జేడీయూ ఎంపీలు వాకౌట్ చేశారు. మరోవైపు టీఆర్ఎస్‌తో పాటు,వైసీపీ ఎంపీలు కూడ సభకు దూరంగా ఉండేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బిల్లును నెగ్గించుకునేందుకు అవకాశం ఉంది.

English summary
The BJP government has listed the contentious triple talaq bill for consideration and passage in the Rajya Sabha on Tuesday.and BJP ally JDU walks out of triple talaq bill discussion
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X