వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోసారి తెరపైకి ట్రిపుల్ తలాక్.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు..!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : ట్రిపుల్ తలాక్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యం చర్చానీయాంశంగా మారింది. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం 2019 రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ కొందరు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అంతేకాదు ఆ చట్టం రాజ్యాంగంలోని నిబంధనలు ఉల్లంఘిస్తోందని పిటిషన్లు దాఖలు చేశారు. ట్రిపుల్ తలాక్ చట్టాన్ని సవాల్ చేస్తూ ఆ మేరకు సుప్రీంకోర్టు మెట్లెక్కారు.

ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా పరిగణించే అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించాలని పిటిషనర్లు పేర్కొన్నారు. ఆ క్రమంలో శుక్రవారం నాడు జస్టిస్ ఎన్‌వి రమణతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్లపై విచారణ జరిపింది. అయితే ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హంగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రామాణికతను పరిశీలిస్తామని బెంచ్ వెల్లడించింది. అయితే ట్రిపుల్ తలాక్ చట్టంపై స్పందన తెలియజేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Triple talaq law notice issued to Centre by Supreme Court

కూర లేదు.. ఉప్పుతో సరి.. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు చుక్కలు..! (VIDEO)

ట్రిపుల్ తలాక్ అనేది రాజ్యాంగ విరుద్దమని ఇదివరకు 2017వ సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ ట్రిపుల్ తలాక్ అనేది కొనసాగుతూనే ఉంది. ఆ క్రమంలోనే రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం దానిపై సీరియస్‌గా దృష్టి సారించింది. ట్రిపుల్ తలాక్ కారణంగా మైనారిటీ సమాజం వెనుకబడుతోందనే కారణంతో.. కొత్త చట్టం తీసుకొచ్చింది.

జులైలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ట్రిపుల్ తలాక్ బిల్లును పార్లమెంట్‌కు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే కొందరు ఎంపీలు మద్దతు పలకడం.. మరికొందరు వ్యతిరేకించినా.. ఎట్టకేలకు నాటకీయ పరిణామాల మధ్య ఆ బిల్లును ఉభయ సభల్లో ఆమోదింపజేశారు. ఆ తర్వాత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కూడా ఆమోద ముద్ర వేయడంతో చట్టం అమల్లోకి వచ్చింది.

English summary
The Supreme Court has issued a notice to the Centre seeking clarification on the constitutional validity of The Muslim Women (Protection of Rights on Marriage) Act, 2019 or the triple talaq law.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X