వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభలో ట్రిపుల్ తలాక్‌పై వాగ్యుద్ధం: అది సరైనదేనని జైట్లీకి డిప్యూటీ చైర్మన్ షాక్

|
Google Oneindia TeluguNews

Recommended Video

ట్రిపుల్ తలాక్‌కు తిప్పలే!

న్యూఢిల్లీ: ముస్లీం మహిళలకు సమానత్వాన్ని కోరుతూ కేంద్రం తీసుకు వచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లును బుధవారం లోకసభలో ప్రవేశ పెట్టారు. కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ దీనిని రాజ్యసభ ముందుకు తీసుకు వచ్చారు. రాజ్యసభలు బిల్లు ప్రవేశ పెట్టిన అనంతరం దీనిపై చర్చ సాగింది. అంతకుముందు కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ.. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలంటూ తీర్మానం ఇచ్చారు.

ట్రిపుల్ తలాక్ బిల్లు: బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, బిల్లు రూపకల్పన ఇలాట్రిపుల్ తలాక్ బిల్లు: బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, బిల్లు రూపకల్పన ఇలా

ట్రిపుల్ తలాక్ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ అన్నారు. మహిళల హక్కులకు తాము, సభ కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలని ఆయన సూచించారు. ఈ మేరకు సెలెక్ట్ కమిటీ పేర్లను చదివి వినిపించారు.

Triple Talaq LIVE Updates: India is Watching That Opposition Supported the Bill in Lok Sabha But is Blocking it Now, Says Jaitley

ప్రతిపక్షం నిబంధనలు పాటించడం లేదని అరుణ్ జైట్లీ అన్నారు. లోకసభలో కాంగ్రెస్ ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిందని, ఇప్పుడు రాజ్యసభలో మాత్రం తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. తీర్మానం ప్రవేశ పెట్టాలంటే ఒక రోజు ముందు నోటీసు ఇవ్వాలని చెప్పారు. కాంగ్రెస్ తీరును భారత్ మొత్తం చూస్తోందన్నారు. ఆనంద్ శర్మ తీర్మానం నిబంధనల ప్రకారమే ఉందని డిప్యూటీ చైర్మన్ అన్నారు. తద్వారా అధికార పార్టీకి షాకిచ్చారు. బిల్లుపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సభను గురువారానికి వాయిదా వేశారు.

English summary
Law minister Ravi Shankar Prasad was recently photographed being handed sweets by gratefully smiling Muslims for his apparently bold act of pushing through the bill banning instant triple talaq.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X