వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో తలాక్...తలాక్...తలాక్... లోక్‌సభలో పాసైన తలాక్ బిల్లు.. వ్యతిరేకించిన 82 మంది ఎంపీలు

|
Google Oneindia TeluguNews

రెండవ సారి త్రిపుల్ తలాక్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం తన పంతం నెగ్గించుకుంది. గురువారం లోక్‌సభలో బిల్లుపై చర్చ చేపట్టింది. ఈనేపథ్యంలోనే ప్రతిపక్షాలు బిల్లును వ్యతిరేకించగా బీజేపీకున్న బలంతో బిల్లు పాస్ అయింది.. బిల్లుకు అనుకూలంగా 303 ఎంపీలు మద్దతు తెలుపగా 82 మంది ఎంపీలు వ్యతిరేకించారు. అనంతరం రాజ్యసభలో బిల్లుపై చర్చ కొనసాగనుంది.

triple talaq was passed by the Lok Sabha,

ట్రిపుల్ తలాక్ బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత దీని ద్వార ట్రిబుల్ తలాక్ చెప్పిన వారికి మూడు సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేశారు. బిల్లుపై చర్చ నేపథ్యంలోనే కేంద్రం తీసుకువచ్చిన త్రిబుల్ తలాక్ బిల్లు మతానికి సంబంధించింది కాదని, ఇది దేశంలోని ముస్లిం మహిళల గౌరవానికి సంబంధించిందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. గురువారం లోక్‌సభలో బిల్లుపై చర్చ సంధర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే బిల్లుపై ఎఎన్డీఏ మిత్రపక్షం జేడీయూతోపాటు ఎమ్ఐఎమ్, కాంగ్రెస్ పార్టీలు వ్వతిరేకిస్తూ వాకౌట్ చేశాయి.

అయితే ట్రిపుల్ తలాక్ వల్ల భర్తలు జైలుకు వెళితే భార్యలకు ఎవరు సహాయం అందిస్తారని ఎమ్ఐఎమ్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాగా బిల్లుపై చర్చించేందుకు పార్లమెంటరీ కమీటీలు వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

English summary
The contentious bill that would criminalise instant triple talaq was passed by the Lok Sabha today after a day-long heated battle that also witnessed a walkout by BJP ally Nitish Kumar's Janata Dal United
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X