వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్రిపురలో జేసీబీతో లెనిన్ విగ్రహం కూల్చివేత, 'తలతో ఫుట్‌బాల్ ఆడుకున్నారు'

|
Google Oneindia TeluguNews

Recommended Video

Lenin statue in Tripura's brought down after BJP's win

అగర్తాలా: త్రిపురలో కమ్యూనిస్ట్ ఐకాన్ లెనిన్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. త్రిపురలోని బెలోనియా నగరంలో ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.

త్రిపుర ప్రజలు కమ్యూనిస్ట్ పాలనకు చరమగీతం పాడి బీజేపీ కూటమిని గెలిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ మద్దతుదారులే ఈ చర్యకు పాల్పడ్డారని లెఫ్ట్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

Tripura BJP supporters bulldoze Lenin statue amid cries of ‘Bharat Mata ki jai’

లెనిన్ విగ్రహాన్ని జేసీబీతో కూల్చేశారు. కూల్చివేసే సమయంలో భారత్ మాతాకీ జై అని నినాదాలు చేశారు. బీజేపీ మద్దతుదారులే ఈ చర్యకు పాల్పడ్డారని సీపీఎం నేతలు ఆరోపించారు.

మరోవైపు, 25 సంవత్సరాల పాటు లెఫ్ట్ నేతలు రాష్ట్రాన్ని పాలించారని, ఆ విగ్రహాన్ని ప్రజలు కూల్చేశారని, లెఫ్టిస్ట్‌లు బలవంతంగా ప్రజలపై రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారనడానికి ఇది నిదర్శనం అని బీజేపీ నేతలు అన్నారు.

లెనిన్ విగ్రహాన్ని బీజేపీ మద్దతుదారులు కూల్చేశారని, ఆ తలతో ఫుట్‌బాల్ ఆడుకున్నారని తమకు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని బెలోనియా సబ్ డివిజన్ సెక్రటరీ సీపీఐ(ఎం) నేత తపస్ దత్తా ఆరోపించారు.

లెనిన్ విగ్రహాన్ని కూల్చివేసిన జేసీబీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతను బెయిల్ పైన విడుదలయ్యాడు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

English summary
In the heart of Belonia town in Tripura’s extreme south, a statue of Communist icon Vladimir Ilyich Ulyanov, better known as Lenin, stood at the centre of College Square for the last five years. At 2.30 pm Monday, 48 hours after the assembly election results were announced, celebrating BJP workers and supporters brought it down with the help of a JCB amid cries of “Bharat Mata ki jai’’.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X