వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమానుషం : వైద్యురాలిపై ఉమ్మేసిన కరోనా పేషెంట్లు... నీకూ కరోనా అంటిస్తామంటూ...

|
Google Oneindia TeluguNews

త్రిపురలో దారుణం జరిగింది. కరోనా సోకిన కొంతమంది పేషెంట్లను ఆస్పత్రిలో చేర్పించేందుకు తీసుకెళ్లిన ఓ మహిళా వైద్యురాలిపై అక్కడి కరోనా పేషెంట్లు ఉమ్మి వేశారు. వార్డు పూర్తిగా నిండిపోయిందని... కొత్తవాళ్లను చేర్చుకోవద్దని పట్టుబట్టిన పేషెంట్లు... ఈ క్రమంలో వైద్యురాలితో వాగ్వాదానికి దిగారు. ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ.. నీకూ కరోనా అంటిస్తామంటూ ఉమ్మి వేశారు.

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...

కరోనా నియంత్రణ నేపథ్యంలో వెస్ట్ త్రిపురలోని భగత్ సింగ్ యూత్ హాస్టల్‌ను కోవిడ్ కేర్ సెంటర్‌గా మార్చారు. త్రిపుర సర్వైలైన్స్ ఆఫీసర్ డా.సంగీత చక్రవర్తి.. కరోనా సోకిన ఐదుగురు బాలింతలను శుక్రవారం(జూలై 24) ఇక్కడి వార్డులో చేర్చేందుకు తీసుకొచ్చారు. ఈ ఐదుగురు ఇటీవలే శిశువులకు జన్మనిచ్చారు. అయితే అప్పటికే వార్డులో కరోనా చికిత్స పొందుతున్న పేషెంట్లు కొత్తవాళ్లను చేర్చవద్దని పట్టుబట్టారు. ఇప్పటికే వార్డు నిండిపోయిందని... కొత్తవాళ్లను తీసుకురావద్దని బెదిరించారు. ఈ క్రమంలో సంగీత చక్రవర్తి వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా... కొంతమంది ఆమెపై ఉమ్మి వేశారు. అసభ్య పదజాలంతో దూషించారు. నీకూ కరోనా సోకేలా చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.

విచారణకు ఆదేశించిన ఎస్పీ...

విచారణకు ఆదేశించిన ఎస్పీ...

ఈ ఘటనను స్థానిక ఎస్పీ మనీక్ లాల్ దాస్ తీవ్రంగా పరిగణించారు. దీనిపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇప్పటికే ఇద్దరు నిందితులను గుర్తించామన్నారు. అయితే వారు కరోనా నుంచి కోలుకున్న తర్వాతే చర్యలు తీసుకోగలమని... అప్పటిదాకా వేచి చూడాల్సిందేనని చెప్పారు.హెల్త్ డిపార్ట్‌మెంట్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే రాకేష్ మాట్లాడుతూ... ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత అరెస్టు కాక తప్పదన్నారు.

మరో 30మందిని చేర్చుకునే సామర్థ్యం ఉన్నా...

మరో 30మందిని చేర్చుకునే సామర్థ్యం ఉన్నా...

వైద్య శాఖ అధికారులు మాట్లాడుతూ... వెస్ట్ త్రిపురలోని కోవిడ్ 19 సెంటర్‌ 300 పడకల సామర్థ్యం కలిగి ఉందన్నారు. డా.సంగీత చక్రవర్తి కొత్తగా ఐదుగురు మహిళా పేషెంట్లను అడ్మిట్ చేసేందుకు వెళ్లినప్పుడు... ఆస్పత్రిలో 270 మంది పేషెంట్లు ఉన్నారని చెప్పారు. మరో 30 మంది పేషెంట్లను చేర్చేందుకు అవకాశం ఉన్నా... అక్కడున్న పేషెంట్లు సంగీత పట్ల అమానుషంగా ప్రవర్తించారని చెప్పారు. జరిగిన ఘటనను నిరసిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని త్రిపుర గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.

Recommended Video

రానున్న 24 గంట‌ల్లో ప‌లు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాల || IMD Warns Of Heavy Rainfall In Several States
కఠిన చర్యలకు డిమాండ్...

కఠిన చర్యలకు డిమాండ్...


డా.కనక్ చౌదరి మాట్లాడుతూ... పేషెంట్లు డా.సంగీత చక్రవర్తిని కేవలం దూషించలేదని... ఆమెపై ఉమ్మి వేసి కరోనా అంటించే ప్రయత్నం చేశారని అన్నారు. ఇది అత్యంత దారుణమైన చర్య అని,వైద్యులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

English summary
A group of patients at a Covid Care Centre in West Tripura district allegedly harassed and spat at a woman doctor when she went to the facility to admit some people, police said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X