వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్రిపుర తూర్పు లోక్ సభ ఎన్నిక వాయిదా .. ఎందుకంటే

|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Election 2019 : త్రిపుర తూర్పు లోక్ సభ ఎన్నిక వాయిదా... ఎందుకంటే? || Oneindia Telugu

త్రిపుర తూర్పు లోక్ సభ నియోజకవర్గానికి జరగాల్సిన ఎన్నిక వాయిదా పడింది. ఏప్రిల్‌ 18న రెండోదశలో భాగంగా త్రిపుర(తూర్పు) లోక్‌సభ స్థానానికి జరగాల్సి ఎన్నికను ఎన్నికల సంఘం(ఈసీ) మూడోదశలో జరిగే ఏప్రిల్‌ 23న జరపాలని నిర్ణయం తీసుకుంది .

<strong>చట్టం పవరేంటో చూపిస్తా: రెండు చానెళ్లు, ఒక ఎంపీపై పీవీపీ పరువునష్టం దావా</strong>చట్టం పవరేంటో చూపిస్తా: రెండు చానెళ్లు, ఒక ఎంపీపై పీవీపీ పరువునష్టం దావా

శాంతి-భద్రతలు అదుపులో లేని కారణంగా ఎన్నిక వాయిదా

శాంతి-భద్రతలు అదుపులో లేని కారణంగా ఎన్నిక వాయిదా

స్థానికంగా శాంతి-భద్రతలు అదుపులో లేవని, స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఎన్నికలు జరిగే అవకాశం లేదని, అసాంఘిక శక్తులు ఎన్నికలకు ఆటంకాలు సృష్టించే అవకాశం ఉందని త్రిపుర ముఖ్య ఎన్నికల అధికారి, ప్రత్యేక ఎన్నికల పరిశీలకుడు ఇచ్చిన నివేదిక మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ నివేదికలో తేలిన కారణంగా అదనపు కేంద్ర బలగాలను పంపించాలని ఎన్నికల అధికారి విజ్ఞప్తి చేశారు .

తోలి విడత ఎన్నికల్లో అల్లర్ల దృష్ట్యా ఏప్రిల్ 23పోలింగ్ కు భద్రత పెంపు

తోలి విడత ఎన్నికల్లో అల్లర్ల దృష్ట్యా ఏప్రిల్ 23పోలింగ్ కు భద్రత పెంపు

తొలి విడత జరిగిన ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తిన చోట వీడియో ఫుటేజ్ చూసామని , ఎక్కడెక్కడ అల్లర్లు జరిగాయో అవి అన్నీ ఎన్నికల సంఘానికి పంపించామని త్రిపుర ఎన్నికల ప్రధానాధికారి శ్రీరాం తరనికంటి చెప్పారు . ఏప్రిల్ 23 న జరగనున్న పోలింగ్ లో ఎలాంటి ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఒక పక్క కాంగ్రెస్, సీపీఐ పార్టీలు 460 పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగిందని తిరిగి అక్కడ రీ పోలింగ్ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

రిగ్గింగ్ జరిగిన చోట తిరిగి ఎన్నికలు నిర్వహించాలంటున్న కాంగ్రెస్ , సీపీఐ నాయకులు

రిగ్గింగ్ జరిగిన చోట తిరిగి ఎన్నికలు నిర్వహించాలంటున్న కాంగ్రెస్ , సీపీఐ నాయకులు

ఏప్రిల్ 11 న వెస్ట్ త్రిపుర లోక్ సభ ఎన్నికల్లో స్పష్టంగా రిగ్గింగ్ జరిగిందని ఆయన త్రిపుర కాంగ్రెస్ నాయకులు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) చట్టబద్దమైన బృందంతో పాటు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఇక ఈసీ 23న త్రిపుర తూర్పు లోక్ సభ ఎన్నికలు జరపాలని నిర్ణయించటంతో త్రిపుర కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రడియాట్ కిషోర్ డబ్బర్మాన్ ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని స్వాగతించారు.

English summary
The Election Commission announced on Tuesday that polling in the Tripura (East) Lok Sabha seat will be postponed from April 18 to April 23, saying the prevailing law and order situation there was not conducive for holding free and fair polls.Citing reports of state chief electoral officer and special police observer, the poll panel said, "The law and order situation prevailing ... is not conducive to the holding of free and fair poll."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X