వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జర్నలిస్ట్ సుదీప్ హత్యకు నిరసన, సంపాదకీయాన్ని ఖాళీగా వదిలిన న్యూస్‌పేపర్లు!

అగర్తలాకు సమీపంలోని ఆర్కేనగర్‌లో త్రిపుర స్టేట్‌ రైఫిల్స్‌(టీఎస్‌ఆర్‌)కు చెందిన కమాండెంట్‌ను కలిసేందుకు వెళ్లిన జర్నలిస్టు సుదీప్ దత్తా భౌమిక్

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అగర్తలా: త్రిపుర రాష్ట్రంలో అధిక సంఖ్యలో వార్తా పత్రికలు గురువారం తమ సంపాదకీయాన్ని ఖాళీగా విడిచిపెట్టాయి. జర్నలిస్ట్ సుదీప్ దత్తా భౌమిక్ హత్యకు నిరసనగానే చాలా దినపత్రికలు ఈ మేరకు ఎడిటోరియల్ రాయకుండా ఖాళీగా విడిచిపెట్టాయి.

అగర్తలాకు సమీపంలోని ఆర్కేనగర్‌లో త్రిపుర స్టేట్‌ రైఫిల్స్‌(టీఎస్‌ఆర్‌)కు చెందిన కమాండెంట్‌ను కలిసేందుకు వెళ్లిన జర్నలిస్టు సుదీప్ దత్తా భౌమిక్ ను అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ కాల్చిచంపిన సంగతి తెలిసిందే.

Tripura newspapers leave editorials blank to protest journalist’s killing

ప్రముఖ బెంగాలీ పత్రిక రిపోర్టర్‌ సుదీప్‌ దత్త భౌమిక్‌.. టీఎస్‌ఆర్‌ కమాండెంట్‌ను కలిసేందుకు వెళ్లాడు. అక్కడ ఉన్న కానిస్టేబుల్‌ అతన్ని అడ్డుకున్నాడు. ఈ సందర్భంగా కానిస్టేబుల్‌, సుదీప్‌కి మధ్య చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది.

దీంతో సదరు కానిస్టేబుల్‌ తుపాకీతో జర్నలిస్ట్ భౌమిక్ ను కాల్చిచంపాడు. ఈ ఘటనను దేశవ్యాప్తంగా పత్రికలు తీవ్రంగా పరిగణించాయి. ఈ నేపథ్యంలో త్రిపుర రాష్ట్రానికి చెందిన పలు పత్రికలు తమ నిరసనను ఈ రకంగా వ్యక్త పరిచాయి.

English summary
Leading newspapers in Tripura on Thursday left their editorials blank to protest the killing of 51-year-old crime reporter Sudip Datta Bhaumik on Tuesday.Bhaumik was shot dead at the Tripura State Rifles’ 2nd battalion headquarters in RK Nagar on the outskirts of Agartala on Tuesday. The police have arrested battalion commandant Tapan Debbarma and his personal security guard Nanda Reang, who allegedly fired the shots at the journalist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X