వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

17 నుంచి 20 గంటలు వీరోచిత పోరాటం, పీఎల్ఏ రాళ్ల దాడి చేయగా ఫైట్, ఐటీబీపీ డీజీ..

|
Google Oneindia TeluguNews

తూర్పు లడాఖ్‌లోని గాల్వాన్ వ్యాలీ వద్ద చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, భారత జవాన్లపై రాళ్లతో దాడిచేసిన సంగతి తెలిసిందే. కల్నల్ సంతోష్ సహా 20 మంది వీరమరణం పొందారు. అయితే ఆ రోజు సరిహద్దు వద్ద ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు విరోచితంగా పోరాడారని తెలిపింది. దాదాపు 17 నుంచి 20 గంటల పాటు పీఎల్ఏపై పోరాడారని గుర్తుచేశారు. హిమాలయా కొండపై రాళ్లతో దాడి చేసే సమయంలో ఫైట్ చేయడం కష్టమని వివరించారు.

Troops Fought Chinese Army for 17-20 Hours:ITBP

ఆ సమయంలో దాదాపు 294 మంది ఐటీబీపీ సభ్యులు వీరోచితంగా ఫైట్ చేశారని డైరెక్టర్ జనరల్ తెలిపారు. ఆ సమయంలో పోరాడిన 21 మందికి శౌర్య పతకాలు ఇవ్వాలని సిఫారసు చేశామని తెలిపారు. పీఎల్ఏ దాడి చేయడంతో మొహానికి షీల్ పెట్టుకొని నిరోధించి. అలాగే ప్రతీ దాడి చేశారని పేర్కొన్నారు.

Recommended Video

Parijaat Tree Significance, History దివి నుండి భువికి వచ్చిన పారిజాతం చెట్టు ఎందుకంత ప్రత్యేకం !

ఛత్తీస్ గడ్‌లో నక్సల్స్ ఏరివేతలో ధైర్య సాహసాలు చూపిన ఆరుగురు సిబ్బందిని డీజీ అభినందించారు. ఐటీబీపీలో 90 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 3 వేల 488 కిలోమీటర్ల ఎల్ఏసీ వద్ద సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. లడాఖ్‌లోని కరకోర నుంచి అరుణాచల్ ప్రదేశ్ వద్ద గల జాచెప్ సరిహద్దులో వీరు విధులు నిర్వహిస్తున్నారు. జూలై 5వ తేదీన ఘర్షణ జరగగా.. ఇండిపెండెన్స్ డే వేళ ఐటీబీపీ డీజీ మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

English summary
294 ITBP force personnel have been awarded the Director General commendation for displaying bravery during recent skirmishes with Chinese troops.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X