వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

horse-trading: రాజ్యసభ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం, ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా..?

|
Google Oneindia TeluguNews

గుజరాత్ రాజ్యసభ ఎన్నిక కోసం ప్రలోభాల పర్వం జోరుగా కొనసాగుతోంది. విపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. రాష్ట్రంలో ఉంటే బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుందని భావించిన కాంగ్రెస్ పార్టీ వారిని.. రాజస్థాన్ తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఐదుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్టు ప్రకటించారు. కానీ తమకు వారి రాజీనామా అందలేదని గుజరాత్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంచేసింది.

రాజ్యసభ ఎన్నిక...

రాజ్యసభ ఎన్నిక...

గుజరాత్ అసెంబ్లీలో 103 సీట్లతో బీజేపీ అధికారం చేపట్టగా.. కాంగ్రెస్ 73 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నెల 26వ తేదీన రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. సంఖ్య బలాన్ని బట్టి బీజేపీ రెండు సీట్లు, కాంగ్రెస్ ఇతరుల బలంతో రెండు సీట్లు గెలుచుకొనే వీలుంది. అయితే మూడో సీటు కోసం కూడా బీజేపీ పోటీ పెట్టడంతో.. కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది.

ఐదుగురి రాజీనామా

ఐదుగురి రాజీనామా

తమ ఎమ్మెల్యేలను రాజస్థాన్ తరలిస్తోంది. అయితే శనివారం రాజస్థాన్ 14 మంది వెళ్లగా.. అందులో నలుగురు క్యాంప్‌నకు చేరుకోలేదు. జేవీ కాక్‌డియా, సోమభాయ్ పటేల్ సహా మరో ఇద్దరు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వీరు గుజరాత్ స్పీకర్‌కి కూడా రాజీనామా అందజేశామని పేర్కొన్నారు. తర్వాత ఎమ్మెల్యే ప్రవీణ్ మరూ కూడా రాజీనామా లేఖ అందజేసినట్టు వివరించారు. దీంతో ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకి చేరుకుంది.

అబ్బే అదేం లేదే....?

అబ్బే అదేం లేదే....?

కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాను ఆ పార్టీ నేత విరిజ్‌ఖాయ్ తుమ్మర్ తోసిపుచ్చారు. వారి రాజీనామాపై ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయని.. కానీ పార్టీకి అధికారికంగా సమాచారం లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సోమ్ భాయ్ పటలే నిన్న సాయంత్రం వరకు తమతో టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు. కాక్‌విడా, మరో ఎమ్మెల్యే మాత్రం కాంటాక్టులో లేరని పేర్కొన్నారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో హార్స్ ట్రేడింగ్‌కు పాల్పడుతారని భావించి.. తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్‌కు పంపిస్తోంది. ఆదివారం సాయంత్రం మరో 20 నుంచి 22 మందిని పంపించనున్నారు.

8 సీట్ల దూరంలో..?

8 సీట్ల దూరంలో..?

గుజరాత్ అసెంబ్లీతో 182 సీట్లు ఉండగా.. బీజేపీ 103, కాంగ్రెస్ 73, బీటీపీ, ఎన్సీపీ ఒక్కో స్థానం గెలచుకున్నాయి. ఒక చోట ఇండిపెండెంట్ గెలిచారు. మూడో రాజ్యసభ సీటు గెలవాలంటే బీజేపీ మరో 8 మంది సభ్యుల మద్దతు తప్పనిసరి. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలను ప్రలోభాలకు గురిచేయాలని బీజేపీ అనుకుంటోంది. ఇందుకు కాంగ్రెస్ కూడా పై ఎత్తులు వేస్తోంది.

English summary
Five Gujarat Congress MLAs resigned on Sunday despite the party shifting its state MLAs to Jaipur ahead of the crucial Rajya Sabha election on March 26.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X