వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

TRP Scam:అర్నాబ్ గోస్వామి షాక్ - అరెస్టు నుంచి రక్షణకు హైకోర్టు నో -ముంబై పోలీసులకు గ్రీన్ సిగ్నల్

|
Google Oneindia TeluguNews

టెలివిజన్ రేటింగ్‌ పాయింట్స్(TRP) పొందడంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి భారీ షాక్ తగిలింది. టీఆర్‌పీ స్కామ్ కు సంబంధించి ముంబై పోలీసులు వేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టేసేలా ఆదేశాలివ్వాలంటూ అర్నాబ్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను బాంబే హైకోర్టు కొట్టేసింది. అంతేకాదు..

అల్పపీడనం:ఏపీలో భారీ వర్షాలు-ఈసారి అధిక వర్షపాతం-ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ సర్వే - కీలక ఆదేశాలుఅల్పపీడనం:ఏపీలో భారీ వర్షాలు-ఈసారి అధిక వర్షపాతం-ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ సర్వే - కీలక ఆదేశాలు

అర్నాబ్‌కు నోటీసులు ఇవ్వండి..

అర్నాబ్‌కు నోటీసులు ఇవ్వండి..

ఈ వ్యవహారంలో అరెస్టు నుంచి అర్నాబ్ కు రక్షణ కల్పించలేమని, కేసుపై ముంబై పోలీసులు విచారణ కొనసాగించవచ్చని, అందులో భాగంగా వెంటనే గోస్వామికి నోటీసులు జారీ చేయాలని హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. టీఆర్‌పీ స్కామ్‌కు సంబంధించి అక్టోబర్-6న ముంబై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ ఏఆర్‌జీ అవుట్ లయిర్ మీడియా(రిపబ్లిక్ టీవీ యాజమాన్యం) దాఖలుచేసిన పిటిషన్ ను విచారించడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు.. ముంబై హైకోర్టుకు వెళ్లాలని సదరు సంస్థకు సూచించడం తెలిసిందే.

లాయర్ ఆ మాట చెప్పడంతో..

లాయర్ ఆ మాట చెప్పడంతో..

జస్టిన్ ఎస్ఎస్ షిండే,జస్టిస్ ఎమ్ఎస్ కర్ణిక్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం టీఆర్‌పీ స్కామ్ కు సంబంధించి రిపబ్లిక్ టీవీ పిటిషన్ ను విచారించింది. అరెస్టు నుంచి అర్నాబ్ కు రక్షణ కల్పించలేమని కోర్టు కరాకండిగా చెప్పడంతో.. ఒకవేళ ముంబై పోలీసులు నోటీసులు ఇస్తేగనుక గోస్వామి విచారణకు హాజరవుతారని రిపబ్లిక్ టీవీ తరఫు లాయర్ విన్నవించుకున్నారు. లాయర్ స్టేట్మెంట్ ను నమోదు చేసుకున్న అనంతరం.. అర్నాబ్ కు నోటీసులు జారీ చేయాలంటూ ముంబై పోలీసులను జడ్జిలు ఆదేశించారు. దాంతోపాటే..

ముంబై పోలీసులు వద్దు.. సీబీఐ కావాలి..

ముంబై పోలీసులు వద్దు.. సీబీఐ కావాలి..

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య, కంగనా రనౌత్ ఆఫీసు కూల్చివేత తదితర వ్యవహారాల్లో రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి బాహాటంగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని దారుణంగా తిట్టిపోయడం, జర్నలిజం విలువలను పక్కనపెట్టి నేరుగా విమర్శలకు దిగడం వివాదాస్పదమైన నేపథ్యంలో టీఆర్‌పీ స్కామ్ కేసును ముంబై పోలీసులు కాకుండా సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని అర్నాబ్ తరఫు లాయర్ కోరగా బాంబే హైకోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను నవంబర్5కు వాయిదా వేసింది. టీఆర్‌పీ స్కామ్ దర్యాప్తు వివరాలను నవంబర్ 4లోగా సీల్డ్ కవర్లో సమర్పించాలని ముంబై పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

షాకింగ్: పురానాపూల్ బ్రిడ్జి డ్యామేజ్? - హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం - పనిచేయని ఐఎండీ రాడార్షాకింగ్: పురానాపూల్ బ్రిడ్జి డ్యామేజ్? - హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం - పనిచేయని ఐఎండీ రాడార్

English summary
In a major setback for Republic TV and Arnab Goswami, the Bombay High Court on Monday refused to stay investigation against the television channel in connection with the TRP scam case. The court also refused to give protection from arrest to Goswami. The high court also asked the Mumbai Police to issue summons to Goswami.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X