వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్ బిల్లును వ్యతిరేకించే నేతలు దేశద్రోహులే.. లోక్‌సభలో టీఆర్ఎస్ సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు దరిమిలా లోక్‌సభలో టీఆర్ఎస్ గళం వినిపించారు ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ ఎంపీ నామా నాగేశ్వరరావు. కశ్మీర్ విభజన బిల్లును వ్యతిరేకించే పార్టీల నేతలు దేశద్రోహులుగా మిగిలిపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లుకు టీఆర్ఎస్ మద్దతిస్తోందని ప్రకటించిన నామా.. ఆసక్తికర అంశాలు ప్రస్తావించారు. ఇవి చీకటి రోజులంటూ కొందరు వ్యాఖ్యానించడం సరికాదని.. ఇవి నిజంగా వికాసం వెదజల్లే రోజులని చెప్పుకొచ్చారు.

కశ్మీర్ విభజన బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు

కశ్మీర్ విభజన బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు

కశ్మీర్ విభజన బిల్లుకు లోక్‌సభలో మద్దతు ప్రకటించింది టీఆర్ఎస్. ఆ మేరకు ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు సభలో అనౌన్స్ చేశారు. ఆర్టికల్ 370 రద్దుపై రాద్దాంతం చేస్తున్న కొందరు నేతలను జనాలు దేశద్రోహులుగా చూస్తారని వ్యాఖ్యానించారు. ఎప్పటినుంచో నానుతున్న సమస్యకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చిటికెలో సమాధానం చెప్పడం హర్షిందగ్గ విషయమని కొనియాడారు.

అయితే కొందరు నేతలు ఇవి చీకటి రోజులంటూ వ్యాఖ్యానించడం సరికాదని మండిపడ్డారు నామా. ఇదివరకు జమ్ము కశ్మీర్‌లో చీకటి రోజులు ఉండేవని.. కానీ ఇప్పుడు అలా కాదని చెప్పుకొచ్చారు. ఇకపై అన్నీ రోజులు కశ్మీర్‌ వికసించే రోజులని చెప్పారు. కాంతి పరిఢవిల్లే రోజులని అన్నారు. మంచి జరగబోతుంటే కూడా చెడు జరుగుతున్నట్లు కొందరు ప్రచారం చేయడం తగదని ధ్వజమెత్తారు.

<strong>ఈ పచ్చ రాయికి మహిమలెక్కువ.. శివలింగం పేరుతో 2 కోట్ల బేరం.. చివరకు..!</strong>ఈ పచ్చ రాయికి మహిమలెక్కువ.. శివలింగం పేరుతో 2 కోట్ల బేరం.. చివరకు..!

పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై అమిత్ షా వ్యాఖ్యలు సమర్థిస్తున్నాం..!

పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై అమిత్ షా వ్యాఖ్యలు సమర్థిస్తున్నాం..!

పాక్ అక్రమిత కశ్మీర్‌ను భారత ప్రభుత్వం వెంటనే ఆక్రమించుకోవాలని కోరారు నామా. ఆ మేరకు పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నామని చెప్పుకొచ్చారు. 370 ఆర్టికల్ రద్దు కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తామని.. ఇన్నాళ్లకు ఆ కల సాకారం అయిందన్నారు. ఇదివరకు ఆర్టికల్ 370 రద్దు కోసం హురియత్ నేతలతో కూడా చర్చలు జరిపిన సందర్భాలున్నాయని తెలిపారు.

కశ్మీర్ విభజన బిల్లుతో ఇక నుంచి అంతా మంచే జరుగుతుందన్నారు. అక్కడ పారిశ్రామికాభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు. ఇన్నాళ్లు అటు కన్నెత్తి చూడని పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొచ్చే అవకాశముందని చెప్పారు. దాంతో కశ్మీర్ బాగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు.

 కశ్మీర్ ప్రజలు ప్రేమ చూపిస్తారు.. ఇకపై వారికి అన్నీ మంచిరోజులే..!

కశ్మీర్ ప్రజలు ప్రేమ చూపిస్తారు.. ఇకపై వారికి అన్నీ మంచిరోజులే..!


కశ్మీర్ విభజన బిల్లుతో అక్కడి ప్రజలకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు. మతాలకు అతీతంగా అక్కడి యువతకు ఉద్యోగవకాశాలు లభిస్తాయని.. ఇకపై అన్నీ మంచిరోజులేనని వ్యాఖ్యానించారు. అందుకే ఆర్టికల్ 370 రద్దుకు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని ప్రకటించారు. అక్కడ అభివృద్ధి జరగబోతున్న తరుణంలో అందరూ స్వాగతించాలే గానీ.. వ్యతిరేకించడం సరికాదన్నారు.

భూతల స్వర్గం కశ్మీర్‌ను ఇన్నేళ్లుగా కాపాడలేకపోయామని.. ఇప్పుడు ఆ రోజు వచ్చిందన్నారు నామా. సుందర కశ్మీర్‌కు ఇక నుంచి అన్నీ మంచిరోజులే అన్నారు. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దుకు టీఆర్ఎస్ మద్దతివ్వడమే గాకుండా భవిష్యత్తులో కశ్మీర్ అభివృద్దిలో పాలుపంచుకుంటామని తెలిపారు. కశ్మీర్‌కు తాను రెండుసార్లు వెళ్లిన సందర్భాలున్నాయని.. అక్కడి ప్రజలు చాలా ప్రేమ చూపిస్తారని చెప్పుకొచ్చారు. అలాంటి ప్రజలకు ఇకపై అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు.

English summary
TRS party's floor leader, MP Nama Nageshwar Rao take space to talk in the Lok Sabha. The leaders of the parties who oppose the Kashmir Partition Bill will remain traitors, he said. NAMA announces that the TRS supports the repeal of Article 370. He also said that, These are not dark days and are vikas din.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X