వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సభలో టీడీపీXటీఆర్ఎస్: గల్లా 'తెలంగాణ'పై కవిత, సుమన్ ఆగ్రహం, గందరగోళం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

అవిశ్వాస తీర్మానంపై ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగం

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం ఉదయం చర్చను ప్రారంభించారు. సభ ప్రారంభం కాగానే బీజేడీ వాకౌట్ చేసింది. ఆ తర్వాత ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తొలిసారి ఎంపికైన తనకు ఇంత గొప్ప అవకాశం దక్కింది. అవిశ్వాసానికి మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు. ఇది టీడీపీ, బీజేపీ మధ్య పోరాటం కాదు.

ఇది మెజారిటీ, మోరాలిటీ మధ్య జరుగుతున్న యుద్ధం. ఎన్డీయే నుంచి తాము బయటకు రాగానే కక్ష కట్టారు. పార్లమెంటు చరిత్రలోనే ఇది చాలా ముఖ్యమైన రోజు. నాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఈ సందర్భంగా భరత్ అనే నేను మూవీ స్టోరీని ఆయన ప్రస్తావించారు. ఇచ్చిన హామీలపై నిలబడాలి.

ఎన్డీయే నుంచి బయటకు రాగానే మాపై కక్షగట్టారు. తమది ధర్మపోరాటం.. ధర్మయుద్ధం. రాష్ట్ర విభజన అనంతరం కొత్తగా ఏపీ.. తెలంగాణ కాదు. పార్లమెంటు చరిత్రలోనే ఇది చాలా ముఖ్యమైన రోజు. ఏపీ ప్రజల ధర్మ పోరాటం ఇది. దీనిని అందరూ గ్రహించాలి. ఏపీకి ఇచ్చిన హామీలు విస్మరించారు. భారతదేశంలో భాగమైన ఏపీకి కనీస ప్రాధాన్యత ఇవ్వట్లేదు.

ఏపీలో నేటి పరిస్థితులకు నాటి కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా కారణం. రెండు జాతీయ పార్టీలు ఏపీకి అన్యాయం చేశాయి. హైదరాబాదును అందరు కలిసి అభివృద్ధి చేశారు. ఏపీ నుంచి చాలామంది హైదరాబాదులో పెట్టుబడులు పెట్టారు. మోడీ కంటే ముందు ప్రధానిగా చేసిన మన్మోహన్ హామీలపై గౌరవం ఉందా.. ఇలా గల్లా జయదేవ్ సుదీర్ఘంగా మాట్లాడారు.

TRS Vs TDP in loksabha, as TRS takes objections TDP MP Galla Reddy remarks Telangana

ఏపీ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం మోడీ ప్రభుత్వం ఏపీపై చూపిస్తున్న వివక్ష. ఏపీపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు. రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా విభజించారు. తలుపులు మూసి మరీ రాష్ట్రాన్ని విభజించారు. విభజనతో తెలుగు తల్లిని ముక్కలు చేశారు. (గల్లా జయదేవ్ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు ఆయన ప్రసంగానికి అడ్డుపడ్డాయి.)

రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా అన్యాయం చేశారు. విభజన నేపథ్యంలో కీలకమైన వన్నీ తెలంగాణలోనే ఉండిపోయాయి. ఏపీ అన్యాయానికి గురైంది. ఆస్తులను తెలంగాణకు, అప్పులను ఏపీకి ఇచ్చారు. తెలంగాణకు ఆదాయాన్ని ఇస్తున్న పలు విషయాలను ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలపై కూడా టీఆర్ఎస్ ఎంపీలు గల్లా ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేశాయి.

దీంతో కొంత గందరగోళం ఏర్పడింది. అప్పుడు స్పీకర్ స్పందిస్తూ.. మీ సమయంలో మీరు మాట్లాడాలని సూచించారు. అయినా తెరాస ఎంపీలు చల్లారలేదు. దీంతో గల్లా కాసేపు తన సీట్లో కూర్చున్నారు. ఆ తర్వాత ఆయన ప్రసంగం ప్రారంభించాక కూడా తెరాస నేతలు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. దీనిపై స్పీకర్ మాట్లాడుతూ.. ఇతరుల మాటలు రికార్డుల్లోకి ఎక్కవని, గల్లా మాటలు మాత్రమే ఉంటాయన్నారు. ఆ తర్వాత మరోసారి కూడా తెరాస అడ్డుకునే ప్రయత్నం చేసింది. అన్ని పార్టీలు అంగీకరించాకే విభజన జరిగిందని తెరాస ఎంపీ జితేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

English summary
No confidence motion in Parliament UPDATES. Debate underway, TDP hits out at Narendra Modi, Amit Shah combine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X