వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌ను వెనక్కి నెట్టిన ట్రూ కాలర్: అత్యధిక డౌన్ లోడ్స్ జాబితాలో టాప్-4..

అత్యధిక డౌన్ లోడ్స్ జాబితాలో వాట్సాప్ తొలి స్థానంలో ఉండగా.. మెసేంజర్, షేరిట్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. యాడ్ మార్కెటింగ్ కు కూడా ట్రూ కాలర్ ఎంతగానో తోడ్పడుతోందని మేరీ మీకర్ వెల్లడించింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 'ట్రూ కాలర్'.. స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న చాలామంది యూజర్స్ ఇప్పుడు ఈ యాప్‌ను తప్పనిసరిగా వాడుతున్నారు. గుర్తు తెలియని నంబర్స్ నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పుడు.. మొబైల్ స్క్రీన్‌పై పేరు కనిపించేలా ఈ యాప్ ఉపకరిస్తుంది. ఇటీవల ట్రూ కాలర్ యాప్ వినియోగం మరింత పెరిగిపోయి.. ఏకంగా ఫేస్ బుక్‌ను అధిగమించేయడం గమనార్హం.

మేరీ మీకర్ ఇంటర్నెట్ ట్రెండ్స్-2017 వెల్లడించిన వివరాల్లో ఈ విషయం స్పష్టమైంది. భారత్ లో అత్యధిక డౌన్ లోడ్ లు పొందిన యాప్ ల జాబితాలో ఫేస్ బుక్ ను వెనక్కి నెట్టి ట్రూ కాలర్ నాలుగో స్థానంలో నిలిచింది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ అత్యధిక డౌన్ లోడ్స్ జరిగినట్లు మేరీ మీకర్ తెలిపింది.

Truecaller becomes fourth most downloaded app in India, surpasses Facebook

కాగా, అత్యధిక డౌన్ లోడ్స్ జాబితాలో వాట్సాప్ తొలి స్థానంలో ఉండగా.. మెసేంజర్, షేరిట్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. యాడ్ మార్కెటింగ్ కు కూడా ట్రూ కాలర్ ఎంతగానో తోడ్పడుతోందని మేరీ మీకర్ వెల్లడించింది. సగటున రోజుకు లక్ష వరకు క్లిక్స్‌ను ట్రూ కాలర్ ఆయా యాడ్స్‌కు అందిస్తున్నట్లు పేర్కొంది.

English summary
Surpassing Facebook, leading communication app Truecaller has become the fourth most downloaded application in India on Google Play Store and is delivering over 100,000 clicks in a day to in-app advertisers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X