వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహాత్ముడికి నివాళికి బదులుగా మోడీ థ్యాంక్స్: రాజ్‌ఘాట్‌లో ఒబామా అలా..సబర్మతిలో ట్రంప్ ఇలా..!

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హఠాత్తుగా వార్తల్లోకి ఎక్కారు. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సబర్మతి ఆశ్రమం సందర్శకుల పుస్తకంలో రాసిన కామెంట్స్.. ఒబామాను గుర్తుకు తెచ్చాయి. ఇదివరకు భారత పర్యటన సందర్భంగా ఒబామా దేశ రాజధానిలోని రాజ్‌ఘాట్‌ను సందర్శించిన సందర్భంగా అక్కడి సందర్శకుల పుస్తకంలో ఆయన రాసిన వ్యాఖ్యలను పోల్చి చూస్తున్నారు నెటిజన్లు.

Recommended Video

Namaste Trump : Donald Trump India's visit - LIVE From Ahmedabad || Oneindia Telugu
విమర్శలకు పని కల్పించిన ట్రంప్ వ్యవహారం..

విమర్శలకు పని కల్పించిన ట్రంప్ వ్యవహారం..

తన గుజరాత్ పర్యటన సందర్భంగా సోమవారం ఉదయం అహ్మదాబాద్‌కు చేరుకున్న ట్రంప్.. తన భార్య, కుమార్తెలతో కలిసి జాతిపిత మహాత్మాగాంధీకి చెంది సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. నూలు వడకడానికి మహాత్ముడు వినియోగించిన రాట్నాన్ని తిప్పారు. అక్కడి సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ రాసిన కామెంట్స్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. విమర్శకుల బుర్రకు పని చెప్పాయి.

మహాత్ముడికి నివాళికి బదులుగా మోడీ థ్యాంక్స్

మహాత్ముడికి నివాళికి బదులుగా మోడీ థ్యాంక్స్

సాధారణంగా- ఏదైనా చారిత్రక ప్రదేశాన్ని గానీ, ప్రఖ్యాత పర్యాటక కేంద్రాన్ని సందర్శించినప్పుడు గానీ.. అక్కడున్న విజిటర్స్ బుక్‌లో వాటికి సంబంధించిన ప్రాధాన్యతలను వివరించడం సహజం. ఇక్కడ ట్రంప్ పొరబడ్డారు. మహాత్ముడి ఆశ్రమాన్ని సందర్శించిన అనంతరం ఆయనను స్మరించుకోలేదు. దానికి బదులుగా నరేంద్ర మోడీకి కృతజ్ఙతలు తెలిపారు. టు మై గ్రేట్ ఫ్రెండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. థ్యాంక్యూ ఫర్ దిస్ వండర్‌ఫుల్ విజిట్ అని రాసుకొచ్చారు.

రాజ్‌ఘాట్‌లో మహాత్ముడిని స్మరించుకున్న ఒబామా..

రాజ్‌ఘాట్‌లో మహాత్ముడిని స్మరించుకున్న ఒబామా..

ట్రంప్ చేసిన కామెంట్స్ కాస్త వివాదాస్పదం అయ్యాయి. 2015లో జనవరి 25వ తేదీన అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన భారత పర్యటన సందర్భంగా మహాత్ముడి సమాధి- రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. మహాత్ముడికి నివాళి అర్పించారు. ఆయనను స్మరిస్తూ విజిటర్స్ బుక్‌లో కామెంట్స్ రాశారు. వాట్ డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ సెడ్ దెన్ రిమైన్స్ ట్రూ టుడే. ది స్పిరిట్ ఆఫ్ గాంధీ వెరీ అండ్ అలైవ్ ఇన్ ఇండియా టుడే అండ్ ఇట్ రిమైన్ ఎ గ్రేట్ గిఫ్ట్ టు ద వరల్డ్.. `అంటూ సుదీర్ఘమైన కామెంట్ రాశారు. నాటి ఒబామా.. నేటి ట్రంప్ కామెంట్లను పోల్చి చూస్తున్నారు నెటిజన్లు.

English summary
“To my great friend, Prime Minister Modi – thank you for this wonderful visit,” the US president wrote about the 15-minute visit. Many were surprised that Trump did not make any mention of Mahatma Gandhi in visitors’ book. Unlike Trump, former US President Barack Obama, on his visit to India in 2010, had hailed Gandhi as “a hero not just to India but to the world”. After visiting Mani Bhavan, Gandhi located in South Mumbai, Obama wrote in the visitors' book, "I am filled with hope and inspiration as I have the privilege to view this testament to Gandhi's life. He is a hero not just to India but to the world.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X