వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌పై అమెరికా సానుకూల వైఖరి: మోడీపై రాహూల్ సెటైర్లు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాక్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సానుకూల సంకేతాలు పంపడంతో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు.ట్విట్టర్ వేదికగా మోడీపై రాహూల్ విమర్శలు చేశారు.

భారత్, అమెరికా సంబంధాలు బలపడటం దేవుడెరుగును కానీ అంతకంటే ఎక్కువగా పాకిస్తాన్‌తో సత్సంబంధాల కోసం ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎదురుచూస్తున్నారని రాహుల్ మండిపడ్డారు.

Trump's U-Turn On Pak Draws Response From Rahul Gandhi. Target - PM Modi.

'మోదీజీ తొందరపడండి, డోనాల్డ్ ట్రంప్ మీ కౌగిలి కోసం ఎదురుచూస్తున్నారంటూ' రాహుల్ ట్వీట్ చేశారు. గతంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో.. పాక్ ఉగ్రవాదులకు చోటిస్తుందన్నారు.

ఇకనైనా ఆ చర్యలు మానుకోవాలంటూ హెచ్చరించిన ట్రంప్ కొన్ని రోజుల్లోనే మాట మార్చిన ఘటనపై రాహూల్ స్పందించారు. దీంతో మోదీజీ త్వరపడండి.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీ కౌగిలింత కోసం ఎదురుచూస్తున్నారంటూ సోషల్ మీడియా ద్వారా రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అసలు విషయం ఏంటంటే.. ఇటీవల పాకిస్తాన్ సైన్యం హక్కానీ ఉగ్రవాద సంస్థ చెర నుంచి అమెరికా-కెనెడియన్‌ కుటుంబాన్ని విడిపించింది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. గత కొన్నేళ్లుగా పాక్ నుంచి అమెరికా లబ్ధి పొందిందన్నారు. పాకిస్తాన్‌తో చాలా అంశాల్లో సంబంధాలను మెరుగు పరుచుకోవాల్సి ఉందని ట్రంప్ వ్యాఖ్యానిస్తూ ట్వీట్ చేశారు.

మరోవైపు ఈ అక్టోబర్ చివరి వారంలో అమెరికా ప్రతినిధి రెక్స్ టిల్లర్‌సన్, భారత్‌లో పర్యటించి దేశ నేతలతో చర్చించనున్న తరుణంలో ట్రంప్, పాక్‌కు మద్ధతిస్తూ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. గతంలో మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో ట్రంప్‌ను ఆత్మీయంగా కౌగిలించుకోవడం అప్పట్లో హాట్‌ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.

English summary
US President Donald Trump's sudden gear-shift on Pakistan has provided the Congress with fresh ammunition. Party vice-president Rahul Gandhi today targetted Prime Minister Narendra Modi, posting a tweet from President Trump and adding a comment
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X